చెన్నైలో బీస్ట్ కు షాక్ ఇచ్చిన కేజిఎఫ్ వసూళ్లు.. ఎంత రాబట్టిందో తెలిస్తే..

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలుసు.

కెజిఎఫ్ చాప్టర్ 1 భారీ హిట్ అందుకోవడంతో చాప్టర్ 2 స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు.

రెండేళ్ల నుండి ఈ సినిమా కోసం సౌత్ ఇండియా మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.ఇంకా ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెరిగాయి.

ఈ నెల 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.రిలీజ్ అయిన అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగి పోయింది.

దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమాలో యష్ యాక్టింగ్ తో మరోసారి దుమ్ము లేపేసాడు.

Advertisement

అలాగే ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ తో అదర గొట్టాడనే చెప్పాలి.దీంతో ఏ ఇండస్ట్రీలో చుసిన ఈ సినిమా గురించే టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ సినిమా కంటే ముందు రోజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా కూడా రిలీజ్ అయినా విషయం తెలిసిందే.ఈ సినిమా కుడి భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే కెజిఎఫ్ కంటే ఒక రోజు ముందుగానే ఈ సినిమా భవితవ్యం తేలిపోయింది.

ఈ రెండు సినిమాలు రిలీజ్ కు ముందు నువ్వా నేనా అన్నట్టు ప్రొమోషన్స్ సాగాయి.

కానీ రిలీజ్ తర్వాత వన్ సైడ్ అయిపొయింది.సొంత రాష్ట్రము లో కూడా బీస్ట్ ప్రభావం చూపించలేక పోయింది.దీంతో కేజిఎఫ్ ముందు బీస్ట్ సినిమా ఎక్కడ నిలవలేదు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

అయితే తాజాగా బీస్ట్ సినిమాకు కెజిఎఫ్ షాక్ ఇచ్చింది.విజయ్ బీస్ట్ ఉండడంతో కెజిఎఫ్ తమిళనాట వసూళ్లు రాబట్టడం కష్టమే అన్నారు.కానీ ఇప్పుడు చుస్తే బీస్ట్ నే కష్టం అంటున్నారు.

Advertisement

ఈ సినిమా సాలిడ్ వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.నిన్న సోమవారం రోజు చెన్నై లో కెజిఎఫ్ కి 62 లక్షలు వచ్చాయి.

బీస్ట్ మాత్రం కేవలం 36 లక్షల తోనే సరిపెట్టుకుంది.దీంతో అక్కడ ఈ సినిమాలు హాట్ టాపిక్ అయ్యాయి.

మరోసారి బీస్ట్ ను కెజిఎఫ్ దెబ్బకొట్టింది.

తాజా వార్తలు