యమ ధర్మరాజు ఎవరినెలా చూస్తాడు?

యముడు లేదా యమ ధర్మరాజు పేరు వినగానే చాలా మంది భయపడిపోతారు.అందుకు కారణం ఆయన నరక లోకానికి అధిపతి.

జనుల అందరి కంటే ముందుగా యమధర్మ రాజు చనిపోయి నరకానికి వెళ్లాడని జ్యోతిశ్య  శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అలా ముందు వెళ్లడం వల్ల నరకానికి అధిపతి అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి.

యముడు ధర‌్మానుసారం సమయం ఆసన్నమైనపుడు జీవుల ప్రాణాలను హరిస్తాడని చెబుతారు.యముని చెంత ఏ విధమైన పక్షపాతానికి, అధర్మానికి స్థానం ఉండదు.

యముని నియమాలు కఠోరమైనవి కనుకనే దండించే వారిలో తాను యముడినని శ్రీ కృష్ణుడు భగవద్గీత విభూతి యోగంలో చెప్పాడు.పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగానే సౌమ్యంగానే కనపడతానని చెబుతారు.

Advertisement
Yamadharma Raju Special Qualities, Yamadharma Raju , Devotional, Yamapuri, Kal

పాపులకు మాత్రం భయంకరమైన రూపంతో రక్త నేత్రాలతో మెరుపులు చిమ్మే నాలుకతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో చేతిలో కాలదండం ధరించి కనబడతాడు.యమ ధర్మరాజు గొప్ప జ్ఞాని.

అలాగే గొప్ప భక్తుడు కూడా.అంతే కాదండోయ్ నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు.

తన దూతలకు భగవంతుని మహత్యాన్ని వర్ణించాడు.

Yamadharma Raju Special Qualities, Yamadharma Raju , Devotional, Yamapuri, Kal

యమ ధర్మరాజు చేతిలో ఉండే పాశమును.కాల పాశం అని పిలుస్తారు.అలాగే యముడు ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా తన వాహనమైన దున్నపోతు మీదే వెళ్తాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

యముడు యమ పురిలో ఉంటారు.దీనినే నరకం అని కూడా అంటారు.

Advertisement

అలాగే ప్రజలు చేసిన తప్పులను లెక్కించేందుకు చిత్ర గుప్తుడనే సహాయకుడు ఎప్పుడూ యమ ధర్మ రాజు వెంటే ఉంటాడు.

తాజా వార్తలు