సుకుమార్‌కు విజయేంద్ర ప్రసాద్‌ కథ వెనుక రహస్యం ఏంటీ

తెలుగు టాప్‌ దర్శకుల జాబితాలో సుకుమార్‌ ఖచ్చితంగా ఉంటాడు.ఈయన ఏ చిత్రం చేసినా కూడా చాలా విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో కథను నడిపిస్తూ ఉంటాడు.

తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం ఏ రేంజ్‌లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బాహుబలి చిత్రం తర్వాత తెలుగులో అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా రంగస్థలం రికార్డును సాధించింది.

ఇంతటి రికార్డును దక్కించుకున్న సుకుమార్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమాకు స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు.ఈ సంవత్సరం చివర్లో సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Writer Vijayendra Prasad Story For Sukumars Next

మహేష్‌బాబు 26వ చిత్రంకు సుకుమార్‌ దర్శకత్వం వహించబోతుండగా, ఆ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్‌ కథను అందించబోతున్నాడు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.బాహుబలితో పాటు హిందీలో పలు చిత్రాలకు కథను అందించి ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ రచయితగా గుర్తింపు దక్కించుకున్న విజయేంద్ర ప్రసాద్‌ కథతో మహేష్‌బాబు మూవీ అనగానే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.అయితే ఇప్పటి వరకు సుకుమార్‌ చేసిన అన్ని సినిమాలకు కూడా సొంత కథను వాడాడు.

Advertisement
Writer Vijayendra Prasad Story For Sukumars Next-సుకుమార్‌క

కాని ఈసారి మాత్రం విజయేంద్ర ప్రసాద్‌ కథతో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.విజయేంద్ర ప్రసాద్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ వారు 10 సినిమాలకు భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు.తెలుగు మరియు హిందీల్లో ఆ చిత్రాలు ఉండబోతున్నాయి.10 కథలను కూడా ప్రముఖ దర్శకులతో, స్టార్‌ హీరోలతో తెరకెక్కించాలనేది వారి ప్రయత్నం.ఈ సినిమాలను ఇతర నిర్మాతలతో కలిసి సంయుక్తంగా నిర్మించేందుకు ఈరోస్‌ ప్రయత్నాలు చేస్తోంది.

మూడు సంవత్సరాల్లో ఈ పది సినిమాలను కూడా పూర్తి చేయాలని భావిస్తుంది.అందులో భాగంగా ఒక సినిమాను సుకుమార్‌ దర్శకత్వంలో ఈరోస్‌ సంస్థ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఆ చిత్రంలో హీరో ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

Writer Vijayendra Prasad Story For Sukumars Next

మహేష్‌తో త్వరలో సుకుమార్‌ చేయబోతున్న సినిమాకు సొంత కథనే ఉపయోగించబోతున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి సుకుమార్‌, విజయేంద్ర ప్రసాద్‌ల కాంబో మహేష్‌ మూవీకి కాదు అంటూ కొందరు, అవును అంటూ మరికొందరు చెబుతున్నారు.ఈ విషయమై క్లారిటీ కోసం మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!
Advertisement

తాజా వార్తలు