ఆన్ లైన్ క్లాస్ ల వల్ల,వర్క్ ఫ్రం హోం ల వల్ల పెరుగుతున్న సమస్యలు ఇవే!

29 ఏళ్ల అంకిత్ అనే యువకుడు వ్యక్తిగతంగా సైక్లిస్టు.

అయితే వృత్తి పరంగా ఐటి రంగంలో పని చేస్తున్న అంకిత్ గత కొద్ది కాలం గా వర్క్ ఫ్రొం హోమ్ ద్వారా పని చేస్తున్నాడు.

అతను ఆన్ లైన్ లో చాలా సైట్ లలో తన సమస్య గురించి వెతకగా అతనికి ఏ ఉపాయం దొరకలేదు.దాంతో అతను వెంటనే హాస్పిటల్ ను సంప్రదించాడు.

Work From Home,Online Studies Troubles Work From Home, Online Class, Health Pro

అతనికి ఎంఆర్ఐ లో వెన్ను పూస జరిగింది అని తేలింది.దాంతో డాక్టర్ లు అతనికి వెన్ను చికిత్స అందించారు.

కొంతవరకు అతని సమస్య తగ్గింది.కానీ సాఫ్ట్ వేర్ ఉద్యోగం అవ్వడం వల్ల అతను రోజంత కూర్చొని పని చేయాల్సి వస్తోంది.

Advertisement

దీనితో అతని సమస్య మరింత తీవ్రమైంది.చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికే ఆన్ లైన్ క్లాస్ లలో పాల్గొంటున్నారు.

దీనివల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్ లు తేల్చి చెప్పారు.ఇది ఇలాగే కొనసాగితే 50 శాతం స్టూడెంట్స్ ఎదో ఒక సమస్య తో హాస్పిటల్ లో చేరుతారని తాజాగా నిర్వహించిన ఒక సర్వే లో తేలింది.

ఔట్ పేషెంట్ విభాగంలో చేరిన చాలా మంది యువకులు తప్పుగా కూర్చోవడం, అవగాహన లోపం వల్ల వెన్ను సమస్యలు తెచ్చుకుంటున్నారని, దీని వల్ల వెన్నుముక్క బలహీనం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.చెవులు, భుజాలు, నడుము అన్ని ఒకే వరుసలో ఉండాలని, తల కూడా కంప్యూటర్ స్క్రీన్ కు ఎదురుగా మరియు నిలువుగా ఉండాలని వారు పేర్కొన్నారు.

అలా చేయకపోతే 15-20 కిలోల బరువు మెడ పై పడుతుందని కూడా వివరించారు.

ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు