వెలగ పండు గుజ్జులో అద్భుతమైన పోషక విలువలు.. స్త్రీలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

వెలగ పండు పేరు అందరూ వినే ఉంటారు కానీ వాటి పోషక విలువలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.

ఈ పండును తినదగిన ఆహార పదార్థంగా చాలా తక్కువ మందే భావిస్తారు.

కానీ ఈ పండులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తెలిస్తే ఎవరైనా సరే వెంటనే డైట్ లో చేర్చుకోక మానరు.వైద్య నిపుణులు ఇందులోని పోషకాల గురించి.

తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చెబుతున్నారు.ముఖ్యంగా ఈ పండు స్త్రీలకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఆ ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూద్దాం.ప్రస్తుతం మనం తింటున్న అన్ని పండ్ల కంటే వెలగ పండులో చాలా ఎక్కువ ఔషధగుణాలు ఉంటాయి.

Advertisement

ఈ పండు పైభాగం చూసేందుకు కొబ్బరికాయలా కనిపిస్తుంది.అందుకే దీనిని నేరుగా తినకుండా పగులగొట్టి అందులోని పోషక విలువలు ఉన్న గుజ్జును ఆరగించాలి.

ఈ గుజ్జు రుచి వగరుగా ఉంటుంది.అయినా కూడా దీనిని పెరుగు పచ్చడి, పప్పు వంటి వంటకాల్లో విరివిగా వాడవచ్చు.

అయితే గుజ్జు పండుగా మారితే మాత్రం దాని రుచి అమోఘంగా ఉంటుంది.అలాగే మంచి సువాసన కలిగి ఉంటుంది.

ఈ పండులో ప్రోటీన్లు, బీటా కెరోటిన్, థైమీన్, రీబోఫ్లోవిన్, నియాసిస్, కాల్షియం, పాస్పరస్, ఐరన్, ఆక్సాలిక్, మాలిక్, సిట్రిక్ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని పలు పోషకాహార అధ్యయనాలు తేల్చాయి.వ్యాధులు మన దరిచేరకుండా ఉండాలంటే వెలగపండు తరచూ తినడం చాలా ముఖ్యం.వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టాలన్నా.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఈ పండు దివ్యౌషధంగా పనిచేస్తుంది.మహిళలు ఎక్కువగా రక్తహీనత సమస్యలతో బాధపడుతుంటారు.

Advertisement

అయితే వెలగపండు గుజ్జు తినడం వల్ల రక్తహీనత సమస్యని అధిగమించవచ్చు.ఇక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు సైతం వెలగ పండు గుజ్జుని తిని ఉపశమనం పొందొచ్చు.అలాగే కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలకు ఇది మంచి ఔషధం.

కంటి చూపును మెరుగు పరచడంలో కూడా ఇందులోని పోషకాలు సహాయపడతాయి.ఈ గుజ్జును తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వ్యాధులను నివారించవచ్చు అని శాస్త్రవేత్తలు తెలిపారు.

అందుకే స్త్రీలు ఈ గుజ్జును తినడం మంచిది.పండుగా మారిన గుజ్జులో బెల్లం లేదా తేనెను కలిపి తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

తాజా వార్తలు