`మఖానా`తో ఎన్ని హెల్త్ బెనిఫిట్సో..బ‌రువూ త‌గ్గుతార‌ట‌!

మ‌ఖానా వీటినే ఫాక్స్ నట్స్ అని, తామర గింజలని కూడా పిలుస్తుంటారు.

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్స్‌లో మ‌ఖానా ఒక‌టి.

వీటి ధ‌ర కాస్త ఎక్కువే అయిన‌ప్ప‌టికీ.అందుకు త‌గ్గ‌ పోష‌క విలువ‌లు మ‌ఖానా దాగి ఉంటాయి.

అందుకే అవి ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అనేక జ‌బ్బుల‌నూ నివ‌రిస్తాయి.

కానీ, చాలా మంది మ‌ఖానా యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలియ‌క‌పోవ‌చ్చు.అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు తెలుసుకుంటే త‌ప్ప‌కుండా త‌మ డైట్‌లో ఫాక్స్ న‌ట్స్ చేర్చుకుంటారు.

Advertisement

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండి.మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు ఫాక్స్ న‌ట్స్‌ గొప్ప వ‌రమ‌ని చెప్పుకొచ్చు.

అవును, వీటిని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.మ‌రియు మ‌ధుమేహం రోగుల‌ను త‌ర‌చూ వేధించే నీరసం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు సైతం దూరం అవుతాయి.

ర‌క్త‌హీన‌త‌ను నివారించ‌డంలోనూ మ‌ఖానా ఉప‌యోగ‌ప‌డుతుంది.మ‌ఖానాలో ఐర‌న్ కంటెంట్ పుష్క‌లంగా ఉంటుంది.

అందు వ‌ల్ల‌, వీటిని తీసుకుంటే ర‌క్త వృద్ధి జ‌రుగుతుంది.దాంతో ర‌క్త హీన‌త ప‌రార్ అవుతుంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

అలాగే అధిక బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారు మ‌ఖానాను తీసుకుంటే చాలా మంచిది.మ‌ఖానాలో కేల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ మ‌రియు ఫ్రోటీన్ ఎక్కువ‌గా ఉంటాయి.

Advertisement

ఇవి త్వ‌ర‌గా వెయిట్ లాస్ అవ్వ‌డానికి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌ఖానాను ఆహారంలో భాగంగా చేర్చుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు, కండ‌రాలు బ‌ల‌ప‌డ‌తాయి.కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.నరాల బ‌ల‌హీన‌త కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.

అంతేకాదు, మ‌ఖానాను తిన‌డం వ‌ల్ల గుండె జబ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం అవుతుంది.మ‌రియు చ‌ర్మం కూడా ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

తాజా వార్తలు