మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా బొప్పాయి ఆకుతో ఇలా చేశారంటే ఒత్తుగా మారాల్సిందే!

బొప్పాయి చెట్టు నుంచి వచ్చే బొప్పాయి పండ్లు( Papaya ) ఎంత ఆరోగ్యకరమో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

అయితే బొప్పాయి పండ్లు మాత్రమే కాదు బొప్పాయి చెట్టు ఆకులతో కూడా చాలా లాభాలు ఉన్నాయి.

ముఖ్యంగా జుట్టు సంరక్షణకు బొప్పాయి ఆకులు ఎంతో మేలు చేస్తాయి.బొప్పాయి ఆకులను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే కొద్ది రోజుల్లోనే కురులు ఒత్తుగా మారతాయి.

అందుకోసం ముందుగా ఒక పెద్ద బొప్పాయి ఆకు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ లో సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ‌ పొడి వేసుకోవాలి.

Advertisement

అలాగే వన్ టేబుల్ స్పూన్ బాదం నూనె( Almond Oil ) మరియు సరిపడా బొప్పాయి ఆకు రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలిక పాటి షాంపూతో శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చు.

బొప్పాయి ఆకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.పల్చటి జుట్టును ఒత్తుగా మారుస్తుంది.

అలాగే బొప్పాయి ఆకు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

అంతేకాదు బొప్పాయి ఆకుని తలకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య( Dandruff ) దూరం అవుతుంది.బట్టతల వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తుంది.

Advertisement

కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన గొర్ల కోసం తప్పకుండా బొప్పాయి ఆకుతో పైన చెప్పిన రెమెడీని ఫాలో అవ్వండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు