చ‌ర్మాన్ని క్ష‌ణాల్లో గ్లోగా మార్చే ద‌బ్బ‌పండు..ఎలాగంటే?

ద‌బ్బ‌పండు.సిట్ర‌స్ పండ్ల‌లో ఇదీ ఇక‌టి.అయితే నిమ్మ, నారింజ, బ‌త్తాయి వంటి వాటితో పోలిస్తే.

ద‌బ్బ‌పండులో పోష‌కాలు కాస్త ఎక్కువ‌గానే ఉంటాయి.అందుకే ద‌బ్బ పండు ర‌సాన్ని ప్ర‌తి రోజు తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.

అనేక జ‌బ్బుల‌ను నివారించుకోవ‌చ్చు.ఇక చ‌ర్మానికి కూడా ద‌బ్బ‌పండు ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా చ‌ర్మంపై మ‌లినాల‌ను, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలిగించి గ్లోగా మార్చ‌డంలో ద‌బ్బ పండు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి స్కిన్‌కు ఈ పండును ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Wonderful Beauty Benefits Of Grapefruit! Beauty, Benefits Of Grapefruit, Grapefr

ముందుగా ద‌బ్బ పండు నుంచి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల ద‌బ్బ పండు ర‌సం, అర‌ స్పూన్ తేనె మ‌రియు ఒక స్పూన్‌ బ్రౌన్ షుగ‌ర్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మానికి ముఖానికి రాసి మెల్ల మెల్ల‌గా స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో స్క్ర‌బ్ చేసుకోవాలి.రెండు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకుని ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా చేస్తే క్ష‌ణాల్లో చ‌ర్మం నిగారింపుగా మ‌రియు మృదువుగా మారుతుంది.

Wonderful Beauty Benefits Of Grapefruit Beauty, Benefits Of Grapefruit, Grapefr

అలాగే ముడ‌త‌ల‌ను నివారించ‌డంలోనూ ద‌బ్బ పండు ఉప‌యోగ‌ప‌డుతుంది.ఒక గిన్నెలో రెండు స్పూన్ల ద‌బ్బ‌పండు ర‌సం, ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసి మిక్స్ చేసుకుని ముఖానికి రుద్దాలి.ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.

న్యూస్ రౌండప్ టాప్ 20

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే ముడ‌త‌లు పోయి యుఖం య‌వ్వ‌నంగా మారుతుంది.

Advertisement

ఇక గిన్నె మూడు, నాలుగు స్పూన్ల ద‌బ్బ పండు ర‌సం, ఒక స్పూన్ బియ్యం పిండి మ‌రియు కొద్దిగా నిమ్మ ర‌సం తీసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మానికి ముఖానికి పూస ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే.చ‌ర్మం గ్లోగా ఉండ‌ట‌మే కాదు క్ర‌మంగా స్కిన్ టోన్ కూడా పెరుగుతుంది.

తాజా వార్తలు