స్త్రీలు రోజుకో మామిడి పండు తింటే ఆ వ్యాధులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంద‌ట‌!

పండ్ల‌లోనే రారాజు అయిన మామిడి పండు గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో మాత్ర‌మే ల‌భించే మామిడి పండ్లు మ‌ధుర‌మైర రుచితో పాటు కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, ప్రోటీన్‌, ఫైబ‌ర్, శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోష‌కాలెన్నిటినో క‌లిగి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా మామిడి పండ్లు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.ముఖ్యంగా స్త్రీలు రోజుకో మామిడి పండు తింటే చాలా మంచిద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇటీవ‌ల రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అండాశయ, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల బారిన పడుతున్న స్త్రీల సంఖ్య అంత‌కంత‌కు పెరిగిపోతోంది.అయితే ఈ క్యాన్సర్లను నిరోధించే సామ‌ర్థ్యం మామిడి పండ్లుకు ఉంద‌ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ల‌భ్య‌మ‌య్యే మామిడి పండ్ల‌ను స్త్రీలు రోజుకొక‌టి చ‌ప్పున తీసుకుంటే ఆయా క్యాన్స‌ర్ల బారిన ప‌డే రిస్క్‌ త‌గ్గుతుంద‌ని అంటున్నారు నిపుణులు.

Advertisement

అలాగే చాలా మంది స్త్రీలు నెల‌స‌రి స‌క్ర‌మంగా రాక నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.అయితే ఈ స‌మ‌స్య నుంచి మామిడి పండ్లు విముక్తిని క‌లిగిస్తాయి.అవును, మామిడి పండ్ల‌ను డైట్‌లో చేర్చుకుంటే ఇరెగ్యుల‌ర్ పీరియ‌డ్స్ రెగ్యుల‌ర్‌ అవుతాయి.

మ‌రియు నెల‌స‌రి స‌మ‌యంలో వేధించే నొప్పులు, పీరియడ్ క్రాంప్స్, మూడ్ స్వింగ్స్ వంటి వాటి నుంచి సైతం బ‌య‌ట‌ప‌డొచ్చు.అంతేకాదు, సీజన్‌ అయిపోయేదాకా స్త్రీలు రోజుకో మామిడి పండు తిన్నారంటే నీర‌సం, అల‌స‌ట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌పడుతుంది.చ‌ర్మం ఆరోగ్యవంతంగా, మృదువుగా త‌యార‌వుతుంది.

మామిడి పండ్ల‌లో ఉండే విట‌మిన్ ఎ, విట‌మిస్ సిలు వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి సైతం ర‌క్షిస్తాయి.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు