ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు కామ అంధకారంలో మునిగి పోయి వారంతట వారే తమ కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు.తాజాగా ఓ మహిళ వ్యక్తిగత దోషం నిమిత్తమై జ్యోతిష్యుడు దగ్గరకి వెళ్లి ఏకంగా అతడితోనే వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అంతటితో ఆగకుండా తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన భర్తని నిర్ధాక్షణ్యంగా హత్య చేసినటువంటి ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని పాట్నా నగర ప్రాంతంలో ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది.
అయితే ఇటీవల తాను ఏ పని చేసినా కలిసి రాకపోవడంతో ఏమైనా దోషం ఉందేమోనని దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుడు దగ్గరకి తన జాతకాన్ని తీసుకొని వెళ్ళింది.అయితే ఆ జ్యోతిష్యుడు దోష నివారణ పేరుతో మహిళకి ఈ మధ్యకాలంలో సన్నిహితంగా ఉంటున్నాడు.
ఈ వ్యవహారం కాస్త అక్రమ సంబంధం వైపు అడుగులు వేసింది.దీంతో ఇద్దరూ కలిసి చెట్టపట్టాలేసుకుని బయట తిరిగే వారు.
చుట్టుపక్కల వారి నుంచి విషయం తెలుసుకున్నటువంటి మహిళ భర్త తన వివాహేతర సంబంధం గురించి హెచ్చరించాడు.అయినప్పటికీ మహిళ వినకపోవడంతో తరచూ ఈ విషయంపై గొడవ పడుతూ ఉండేవాడు.దీంతో మహిళ భర్తని చంపేందుకు పన్నాగం పన్నింది.ఇందులో భాగంగా జ్యోతిష్యుడుని తన ఇంటికి రప్పించి కావాలనే తన భర్తతో వాగ్వాదం పెట్టుకొని జ్యోతిష్యుడుతో తన భర్తని హత్య చేయించింది.దీంతో చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అలాగే మృతుడి భార్య తెలిపిన టువంటి వివరాల మేరకు జ్యోతిష్యు డిని మరియు మృతుడి భార్యపై కేసు నమోదు చేసుకొని విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.