టాలీవుడ్ హీరో నాగచైతన్య (naga chaitanya)హీరోగా నటించిన తాజా చిత్రం తండేల్(thandel).చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో సక్సెస్ ని అనుకున్నారో నాగ చైతన్య.
చందు మొండేటి (Naga Chaitanya, Chandu Mondeti)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.తాజాగా ఫిబ్రవరి 7న గ్రాండ్గా విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ పాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
దీంతో తండేల్ టీమ్ (Tandel Team)విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంది.ఈ మూవీ సక్సెస్ కావడంతో సంబరాల్లో మునిగిపోయారు చిత్ర యూనిట్.

ఇది ఇలా ఉంటే తండేల్ సినిమాను చూసిన ఒక మహిళ అభిమాని ఫుల్ ఎమోషనల్ అయింది.సినిమాలో నాగచైతన్యకు సంబంధించిన ఓ సీన్ ప్లే అవుతుండగా ఏడుపును ఆపుకోలేకపోయారు.వెక్కి వెక్కి మరీ ఏడుస్తూ కనిపించారుయ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీన్ని బట్టి చూస్తే తండేల్ ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా ఎంతలా కనెక్ట్ అయిందో అర్థమవుతోంది.
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది ఓవరాక్షన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కొంతమంది సినిమా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే తండేల్ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమా మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కించారు.
నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.రియల్ లవ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులకు మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది.
ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.







