ఇటీవలే వివాహేతర సంబంధాలన్నీ చివరికి విషాదంగా ముగిస్తూ దారుణ హత్యలకు కారణం అవుతున్నాయి.కాసేపటి శారీరక సుఖం కోసం ఏర్పడే వివాహేతర సంబంధాలు( Illegal Affairs ) వారి జీవితాలనే కాదు ఏకంగా కుటుంబాలనే నాశనం చేస్తుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
ఓ తాంత్రికుడు తనకు పరిచయం అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, చివరికి ఆ మహిళను చంపి, మృతదేహానికి నిప్పు పెట్టిన దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని( Uttar Pradesh ) గొండాలో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.గొండా లోని సిద్ధార్థ్ నగర్ లో మీనా దేవి (35)( Meena Devi ) అనే మహిళ తన కూతుర్లతో కలిసి నివసిస్తోంది.ఆమె భర్త మరోచోట పని చేస్తున్నాడు.అయితే మీనాదేవికు భగవాన్ దీన్ అనే తాంత్రికుడు పరిచయం అయ్యాడు.
వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.ఇక భగవాన్ దీన్ తరచూ మీనా దేవి ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు.

చుట్టుపక్కల ఉండే స్థానికులు ఇతను ఎవరు అని ప్రశ్నించగా.మీనా దేవి ఆ తాంత్రికుడిని తన మామ అని తెలిపింది.అయితే వీరిద్దరూ కలిసి కిచోచా షరీఫ్ దర్గాకు వెళ్లారు.అక్కడ వీరిమధ్య మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది.క్షణికావేశంలో ఆ తాంత్రికుడు ఆమె గొంతు కోసేశాడు.క్షణాల్లో మీనా దేవి ప్రాణాలు కోల్పోయింది.
వెంటనే ఆమె మృతదేహాన్ని చెట్ల పొదల్లో వేసి నిప్పు పెట్టాడు.

మీనా దేవి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు మీనా దేవి ఇంటి పక్కన ఉండే స్థానికులను విచారించగా.భగవాన్ దీన్( Bhagavan Deen ) తరచూ ఆమె ఇంటికి వస్తూపోతూ ఉండేవారని తెలిపారు.
పోలీసులు భగవాన్ దీన్ ను చాకచక్యంగా పట్టుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.







