10 ఏళ్ల తరువాత దొరికిన బాటిల్ మెసేజ్.. అందులో ఏముందో తెలిస్తే..

సాధారణంగా చాలా ఏళ్ల క్రితం లెటర్లను బాటిల్‌లో వేసి దానిని ఇతరులకు పంపించడం జరిగేది.

అప్పట్లో ఫోన్లు లేదా వాట్సాప్ వంటి మెసేజింగ్ సర్వీసులు లేక ఆ పద్ధతిని ఫాలో అయ్యేవారు.

అయితే అలా పంపిన కొన్ని బాటిల్స్ ఎప్పటికీ సముద్రంలోనే ఉండిపోయాయి.వాటిలో కొన్ని అప్పుడప్పుడు ఇప్పటి వారికి దొరుకుతూ వార్తల్లో నిలుస్తున్నాయి.

తాజాగా ఒక మహిళకు 10 ఏళ్ల క్రితం రాసిన బాటిల్‌ మెసేజ్‌( Bottle Message ) దొరికింది.అందులోని లెటర్ రాసిన వ్యక్తిని ఆమె కనుగొనగలిగింది.

ఈ సందేశాన్ని ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇనెస్ జెప్కాన్( Ines Zepcan ) రాశారు.ఆమె విక్టోరియాలోని( Victoria ) పోర్ట్‌ల్యాండ్‌లోని ఒక ప్లేస్ నుంచి సీసాని సముద్రంలో విసిరింది.మెసేజ్‌ను కనుగొన్న మహిళ సోషల్ మీడియా ద్వారా దాన్ని రాసిన ఇనెస్‌ను సంప్రదించింది.ఇనెస్ ఆ లెటర్ తానే రాసినట్లు తెలిపింది.10 ఏళ్ల క్రితం తాను రాసిన మెసేజ్ లేదా లెటర్‌ను ఎవరో కనుగొన్నారని, అది తనకు, తన కుటుంబానికి జ్ఞాపకాలను తెచ్చిందని ఆమె సంతోషించింది.

Advertisement

బాటిల్‌లో రాసిన మెసేజ్‌లు దొరకడం కొత్తేమీ కాదు.ఈ ఏడాది ప్రారంభంలో 40 ఏళ్ల క్రితం రాసిన ఒక బాటిల్ మెసేజ్ బయటపడింది.ఇకపోతే రీసెంట్‌గా పదేళ్ల క్రితం నాటి బాటిల్ మెసేజ్ దొరికింది.

ఈ బాటిల్ తనకు దొరికినట్లు ఒక మహిళ వీడియో కూడా రికార్డు చేసింది.ఆ వీడియో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం జరిగింది.

దీనికి చాలా లైక్‌లు, పాజిటివ్ కామెంట్లు వచ్చాయి.బాటిల్‌ను సముద్రంలోకి విసిరేయడం వల్ల కలిగే పర్యావరణ హానికి తాను బాధ పడుతున్నట్లు ఇనెస్ చెప్పింది.

కాగా ఈ బాటిల్ వల్ల తనకు పాత నుంచి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని సంతోషించింది.

వైరల్ : తల్లిదండ్రుల ప్రేమకు మించి మరొక ప్రేమ లేదనడానికి ఇదే ఉదహరణ కాబోలు..
Advertisement

తాజా వార్తలు