మహిళా బిల్లు గేమ్ చేంజర్ గా కానుందా ?

పైకి మహిళా బిల్లుem>( Womens Reservation Bill )కు తామ అనుకూలమే అని ఆ ఘనత తమదేనని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవానికి మహిళా అభ్యర్థులకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 33 శాతం టికెట్లు కేటాయించడం అనేది ప్రతి పార్టీకి కష్ట సాధ్యమేనని వార్తలు వినిపిస్తున్నాయి .

ముఖ్యంగా ఎన్నికలనేవి ఒక యుద్దంలా మారిపోయి అన్ని రకాల వ్యూహాలను అమలుపరచాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీల అభ్యర్థిత్వం ఏ మేరకు పార్టీలకు లాభిస్తుందని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయట .

కీలక నాయకులు తమ బార్య లను ముందుకు పెట్టి చక్రం తిప్పవచ్చు అని ఆలోచిస్తునప్పటికీ రాజకీయాలపై కనీస ఆసక్తి గాని అవగాహన గాని లేని ఆ మహిళా మణులు ఏ మేరకు ప్రచార కార్యక్రమాలను ముందుకు నడిపించగలరో అన్న భయాలు కూడా వారిని వేదిస్తున్నాయట .

మరోపక్క ఇంతకుముందు మహిళా బిల్లును అనేకసార్లు వీగిపోయేలా చేసిన ఆర్జేడి , సమాజ్వాది లాంటి పార్టీలు ఇండియా కూటమి లో కీలక భాగస్వామి పక్షాలుగా ఉండటంతో ఇప్పుడు ఇండియా కూటమికి మహిళా అభ్యర్థులు పెద్ద సమస్యగా మారబోతున్నట్లుగా తెలుస్తుంది.అయితే 2024 ఎన్నికల( 2024 elections ) వరకువరకూ పాత చట్టాలు అమలులో ఉండటంతో అది కొంత ఊరట గా భావించవచ్చు.2029 సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ మహిళా బిల్లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే మొదట్లో రాజకీయ నాయకులు వారి భార్యలను నిలబెట్టినప్పటికీ తర్వాత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశించే చాలామందికి మహిళలకు ఈ మహిళా బిల్లు ఒక ప్రధాన అస్త్రంగా మారబోతుందని తెలుస్తుంది .సమాజంలో మార్పు కోసం పనిచేయాలనుకునే ఉత్సాహవంతులైన మహిళా అభ్యర్థులకు ఈ మహిళా బిల్ ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేయబోతుందంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు .ఈ బిల్లు అమలులోకి వస్తే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో స్త్రీల వాటా గణనీయంగా పెరుగుతుందని చట్టాల రూపకల్పన లోను అమలులోను తమ ముద్రను చూపిస్తూ తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తారని అంచనాలు వస్తున్నాయి.ఇప్పటివరకు కేవలం కేవలం నామమాత్రంగానే స్త్రీలకు సీట్లను కేటాయిస్తున్న కొన్ని పార్టీలు ఇక తప్పనిసరి హక్కుగా కేటాయించాల్సిన పరిస్థితి రావడంతో ఇప్పటివరకు ఎన్నిక నామమాత్రంగా వారి ప్రాతినిధ్యం ఉన్న రా ష్ట్రాల రాజకీయాల్లో సమూల మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Advertisement

ఏది ఏమైనా తమ రాజకీయ ప్రయోజనాల కోసం అయినా బజాపా( BJP ) బారత ఎన్నికల విదానం లో ఒక సమూల మార్పుకు నాంది పలికింది అని చెప్పవచ్చు .

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు