ఊరిస్తున్న పదవి .. ఈటెల కు లైన్ క్లియర్ ఎప్పుడో ?

గత కొద్ది రోజులుగా తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి మార్పు విషయమే తెలంగాణ రాజకీయ( Telangana politics ) వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి, ఆయన స్థానంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajender ) కు అధ్యక్ష పదవి ఇస్తారని, కేసీఆర్ వ్యూహాలు అన్నీ తెలిసిన వ్యక్తి కావడంతో ఎన్నికల వ్యూహాలు బాగా పనిచేస్తాయనే ఉద్దేశంతో ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతుంది.

బిజెపి అధ్యక్ష పదవి మార్పు విషయమై మొత్తం తతంగమంతా పూర్తయిందని, ఇక ప్రకటన వెలువడడం ఒక్కటే మిగిలి ఉందని, అంత భావిస్తూనే వస్తున్నారు.ఇక ఖమ్మంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah ) సభలో దీనిపై క్లారిటీ ఇస్తారని అంతా భావించినా కొన్ని కారణాల వల్ల ఆ సభ రద్దయ్యింది.

దీంతో ఈటెల రాజేందర్ పదవి విషయమై ప్రకటన ఎప్పుడు వస్తుందనేది క్లారిటీ లేదు.అయితే మీడియా సోషల్ మీడియాలో మాత్రం రాజేందర్ పదవి పై ప్రచారం జరుగుతుంది.

ఇంత జరుగుతున్న ఈటెల రాజేందర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు.తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన ఈ అంశంపై స్పందిస్తారని అంతా భావించారు.కానీ ఆయన మాత్రం కెసిఆర్( KCR ) ప్రభుత్వం పై విమర్శలకు పరిమితమయ్యారు తప్ప, పదవి విషయంలో స్పందించేందుకు ఇష్టపడలేదు.

Advertisement

దీంతో ఆయనకు పదవి వస్తుందా రాధా అనేది ఆసక్తికరంగా మారింది.అమిత్ షా సభతో తెలంగాణ బిజెపిలో నెలకొన్న గందరగోళానికి చెక్ చేపడుతుందని అంతా భావించినా, అది వాయిదా పడడంతో దీనిపై ఇంకెప్పుడు ప్రకటన వెలువడుతుందనేది అందరికీ టెన్షన్ కలిగిస్తుంది.

నిన్ననే బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ స్పందించారు.

అధ్యక్ష పదవి విషయంలో ఏ మార్పు ఉండదని చెప్పారు.అయితే ఈటెల రాజేందర్ విషయంపై మాత్రం ఆయన స్పందించలేదు.మరోవైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది.

దీంతో అధ్యక్ష పదవి మార్పు విషయంలో ఏదో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు తెలంగాణ బిజెపి వర్గాల్లో నెలకొన్నాయి.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు