తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ సినిమాను చేస్తుంటారు.అయితే ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులను అలారించడానికి మన ముందుకు వస్తున్నారు.
అందులో ముఖ్యంగా మహేష్ బాబు గుంటూరు కారం( Guntur Karam ) సినిమాతో వస్తే వెంకటేష్ సైంధవ్, ( Saindhav ) నాగార్జున నా సామిరంగా( Naa Saami Ranga ) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇక ఇదే క్రమంలో హనుమాన్ సినిమా ( Hanuman Movie ) కూడా ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వస్తుంది.
అయితే వీళ్ళు ముగ్గురు సీనియర్ హీరోలు మధ్యలో ఒక యంగ్ హీరో సినిమా రావడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.నిజానికి హనుమాన్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా మీద ఆటోమేటిక్ గా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగిపోయాయి.

దాంతో ఈ సినిమా కూడా భారీ వసూళ్లను రాబడుతుందనే టాక్ అయితే వినిపిస్తుంది.మరి సీనియర్ హీరోలను( Senior Heros ) తట్టుకొని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుంది అని మరి కొంతమంది వాళ్ళ కామెంట్లని తెలియజేస్తున్నారు.నిజానికి మిగతా ముగ్గురు హీరోలు కూడా ఇండస్ట్రీ లో దాదాపు 20 సంవత్సరాల పైన కెరియర్ ని కొనసాగిస్తున్న వాళ్ళు కావడం అందులోనూ తేజ సజ్జా( Teja Sajja ) ఒక యంగ్ హీరో ఆయనకి సరిగ్గా ఒకటి రెండు హిట్లు కూడా లేవు అలాంటి

ఒక యంగ్ హీరో వాళ్ళని తట్టుకొని ఏ మేరకు నిలబడగలుగుతాడు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది…అయితే మరి కొంతమంది మాత్రం కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ఆడుతాయి అంటూ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…మరి సంక్రాంతి బరిలో హిట్ కొట్టి ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో అవుతారో తెలియాలంటే సంక్రాంతి పండుగ వరకు ఎదురు చూడక తప్పదు…








