జక్కన్న సినిమాకు మహేష్ ఆ సెంటిమెంట్ పాటిస్తారా.. విమర్శలకు చెక్ పెట్టారుగా!

మహేష్( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) కాంబో సినిమాకు సంబంధించి రెండున్నర సంవత్సరాల క్రితమే ప్రకటన వెలువడింది.వేర్వేరు కారణాల వల్ల షూట్ ఆలస్యమవుతున్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ వచ్చేశాయి.

2025 సంవత్సరం జనవరి 2వ తేదీన ఈ సినిమాకు ముహూర్తంగా నిర్ణయించారు.అయితే సాధారణంగా మహేష్ బాబు తన సినిమాల ముహూర్తం ఈవెంట్ కు హాజరు కావడానికి ఇష్టపడరు.

ఈ విషయం ఆయన అభిమానులకు సైతం తెలుసని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జక్కన్న సినిమాకు మహేష్ ఆ సెంటిమెంట్( Mahesh Babu Sentiment ) పాటిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది.

రాజమౌళి తన సినిమాకు సంబంధించి ప్రతి ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటారు.కొన్ని సినిమాలకు సంబంధించి జక్కన్న ముందుగానే స్టోరీ లైన్ ను రివీల్ చేసిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.

Advertisement

మహేష్ మూవీ విషయంలో జక్కన్న ఏం చేస్తారో చూడాల్సి ఉంది.ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు అని వార్తలు వినిపిస్తున్నా సినిమా రిలీజ్ సమయానికి బడ్జెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.2027 సంవత్సరంలో మహేష్ జక్కన్న కాంబో మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.మహేష్ జక్కన్న మూవీ మరింత ఆలస్యం అవుతుందనే రూమర్లకు మాత్రం చెక్ పెట్టారనే చెప్పాలి.

రాజమౌళి సినిమాల డిజిటల్ హక్కులకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది.రాజమౌళి ఈ సినిమా కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం.మహేష్ సైతం ఈ సినిమాకు కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీ ఎన్నో సంచలనాలను సృష్టిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ రాజమౌళి కాంబో మూవీపై ఇతర భాషల్లో సైతం అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

రాజమౌళి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్ సంక్రాంతి సినిమాలకు భారీగా అదనపు రేట్లు.. ఆ రేట్లతో మూవీ చూస్తారా?
Advertisement

తాజా వార్తలు