తెలంగాణ రాజకీయాలలో ఇప్పటి నుండే అనధికారికంగా ఎన్నికల వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్న తరుణంలో రోజు రోజుకు రాజకీయ వాతావరణం హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.
అయితే వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ కిషోర్ టీంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.అయితే గత రెండు దఫాలు జరిగిన విధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు.
అయితే ప్రస్తుతం తాజాగా కేసీఆర్ నిర్వహించుకున్న సర్వేలో వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడైనట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకు గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఒక్కడై రాష్ట్రమంతా సుడిగాలి ప్రచారాన్ని నిర్వహించి విజయవంతంగా ఎన్నికల్లో గెలిచి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మూడో సారి గత రెండు ఎన్నికల కంటే ఈసారి టీఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టి పోటీనిచ్చిన పరిస్థితుల్లో ఈసారి పీకే టీంతో జత గడుతున్నట్టు తెలుస్తోంది.

అంతేకాక ఇప్పటి వరకు కేసీఆర్ తన స్వంత వ్యూహంతోనే నడిపించినా పీకె టీం ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.అయితే ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ కు అతిపెద్ద అడ్డంకిగా మారిన నిరుద్యోగుల నోటిఫికేషన్ ల అంశం కూడా దేశ వ్యాప్తంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేవలం 0.7 శాతం మాత్రమే నిరుద్యోగం ఉందని రిపోర్ట్ లు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ కు ఇది కొంత ఊరట నిచ్చే అంశంగా మనం చెప్పవచ్చు.ఏది ఏమైనా తెలంగాణలో పీకె టీం ఎంట్రీ అనే అంశం మరింత ఆసక్తికర అంశంగా మారే అవకాశం ఉంది.