కేసీఆర్ జాతీయ పార్టీకి ఏపీలో ఆదరణ దక్కుతుందా?

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు.ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును మార్చి భారతీయ రాష్ట్ర సమితిగా దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.

 Will Kcr National Party Gain Popularity In Andhra Pradesh?,cm Kcr,telangana,bjp,-TeluguStop.com

అయితే బీఆర్ఎస్ పార్టీకి తెలుగు రాష్ట్రం, పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఆదరణ దక్కుతుందా అనే విషయం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒకప్పుడు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ 2014 ఎన్నికల్లో కొన్ని సీట్లను కూడా గెలుచుకుంది.

అటు వైసీపీ కూడా 2014 ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది.ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ఏపీకి మాత్రమే పరిమితం అయ్యాయి.తెలంగాణలో ఈ రెండు పార్టీలకు అడ్రస్ లేకుండా పోయింది.కారణం ఏంటె అందరికీ తెలిసిందే.

కేసీఆర్ తన రాజకీయ చతురత ఉపయోగించి ఆ రెండు పార్టీలను తెలంగాణలో వాష్ అవుట్ చేసేశారు.ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఏపీలో తన పార్టీని విస్తరించాలని భావిస్తే టీడీపీ, వైసీపీ ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Telugu Andhra Pradesh, Brs, Chandrababu, Cm Kcr, Jagan, Telangana-Political

కేసీఆర్ పార్టీ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం కచ్చితంగా అధికార పార్టీ వైసీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.అన్నింటికంటే ముఖ్యంగా కేంద్రంలో బీజేపీతో సత్సంబంధాలు నెరుపుతున్న జగన్.కేసీఆర్ జాతీయ పార్టీ విషయంలో ఎలా స్పందించినా అది రెంటికీ చెడ్డ రేవడిలా మారుతుంది.కేసీఆర్ పార్టీతో జగన్ పొత్తు పెట్టుకుంటారా లేక ప్రత్యర్ధిగా భావిస్తారా అన్న దానిపైనా ఆసక్తి పెరుగుతోంది.

Telugu Andhra Pradesh, Brs, Chandrababu, Cm Kcr, Jagan, Telangana-Political

ప్రస్తుతానికైతే కేసీఆర్ జాతీయ పార్టీతో ఏపీలోని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేనతో ఎలాంటి పంచాయతీ లేదు.అయితే బీజేపీతో వైసీపీ స్నేహంగా ఉండటంపై సీఎం కేసీఆర్ అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టాక్ నడుస్తోంది.ఈ కారణంగానే ఆయన వైఎస్ జగన్‌ను కూడా టార్గెట్ చేస్తారేమో అనే చర్చ సాగుతోంది.అయితే సీఎం కేసీఆర్ సారథ్యంలోని జాతీయ పార్టీని అసలు ఏపీ పార్టీలు లెక్కలోకి తీసుకుంటాయో లేదో ఇప్పుడే చెప్పలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అటు కేసీఆర్ జాతీయ పార్టీ బాధ్యతలను, వ్యవహారాలను ఏపీలో ఉండవల్లి అరుణ్‌కుమార్ చక్కపెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube