రాహుల్ యాత్ర‌కు జ‌గ‌న్ ఓకే చెప్తారా..? ఫ్ల్యాష్ బ్యాక్ గుర్తుకు తెచ్చుకుంటే..?

కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు.కాబోయే ప్ర‌ధాని రాహుల్ గాంధీ పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి దేశ‌వ్యాప్తంగా యాత్ర చేప‌ట్ట‌నున్నారు.

 Will Jagan Say Ok To Rahul's Trip? If You Remember The Flash Back , Rahul Gandhi-TeluguStop.com

ఈ యాత్ర వ‌చ్చే నెల‌లో ప్రారంభం అవుతుంద‌ని అంటున్నారు.ఈ నేప‌థ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప‌ర్య‌టించ‌నున్నారు.

అయితే మొద‌ట‌గా రూట్ మ్యాప్ లో ఏపీ లేద‌ట‌.కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని ఏపీలో కూడా ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఏపీలో కాంగ్రెస్ దాదాపు క‌నుమ‌రుగైంది.ఈ నేప‌థ్యంలోనే పార్టీని తిరిగి బ‌లోపేతం చేయ‌డానికి ఏపీలో కూడా యాత్ర చేప‌ట్టాల‌ని అధిష్టానం నిర్ణ‌యం తీసుకుందట‌.

ఇక ఏపీలో రాహుల్ య‌త్ర రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు.నాలుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా సాగుతుంద‌ని అంటున్నారు.అయితే రాహుల్ గాంధీ ఏపీకి వచ్చి చాలా కాలం అయింది.అంతే కాదు ఆయన ఏపీ కాంగ్రెస్ ని కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు కూడా.

కానీ ఇప్పుడు రాహుల్ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఊపుతేబోతున్నారు.అందులో ఏపీ కూడా ఉంది.

ఇక కాంగ్రెస్ ఏపీలో ఎక్కడ న‌ష్ట‌పోయిందో రాహుల్ కి స్పష్టంగా తెలుసు.అంతే కాదు కాంగ్రెస్ కి ఆస్తి లాంటి ఓటు బ్యాంక్ అంతా జగన్ వద్దకే చేరింది అని కూడా తెలుసు.

ఒక విధంగా తన ఓటు బ్యాంక్ ని తిరిగి పొందడానికి రాహుల్ ఏపీలో పాదయాత్ర పెట్టుకున్నారంటున్నారు.మొదట పాదయాత్ర రూపకల్పనలో ఏపీ ఎక్కడా లేదు.

కానీ కాంగ్రెస్ హై కమాండే కోరి మరీ రూట్ మ్యాప్ లో చేర్చింద‌ట‌.

ప్ర‌త్యేక హోదాపై విమ‌ర్శ‌లు త‌ప్ప‌వా…?అయితే కేవ‌లం ఏపీలో ప‌ర్య‌టించ‌డానికికైతే రాహుల్ రావ‌డంలేద‌న్న‌ది నిజం.ఈ క్ర‌మంలోనే ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ‌టం ఖాయ‌మంటున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ హామీ ఇస్తే దాన్ని తూట్లు పొడిచార‌ని నిప్పులు చెరిగే అవ‌కాశం లేక‌పోలేదు… అలాగే పోలవరాన్ని అయిదేళ్ల‌ కాలంలో పూర్తి చేసేలా తాము విభజన చట్టంలో పెడితే బీజేపీతో కలసి వైసీపీ ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పడం లేద‌ని ఫైర్ అవ‌ట‌మూ ఖాయ‌మే… అలాగే ఏపీకి రాజధాని లేకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇలా అనేక అంశాలతో పాటు అభివృద్ధి లేమి.అప్పుల ఆంధ్రాతో సహా.మోడీతో జగన్ కలసి ఉండడాన్ని కూడా చెప్పి మరీ మైనారిటీలను త‌మ వైపున‌కు తిప్పుకునే వ్యూహానికి పదును పెడతారు.

Telugu Cm Jagan, Indiannational, Rahul Gandhi, Rahul-Political

మ‌రి జ‌గ‌న్ అనుమ‌తి ఇస్తారా అలాంటి రాహుల్ ఏపీలో అడుగుపెట్టాలంటే జగన్ అనుమతి ఇవ్వాలి.అది ఇవ్వాలంటే ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తుకుతెచ్చుకుంటారు మ‌రి.జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండగా ఆయన తండ్రి నాటి సీఎం వైఎస్సార్ మరణించారు.

ఆ తరువాత జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తాను అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ అడ్డుకున్నారు.దీంతో జగన్ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేసి ఏకంగా పార్టీ పెట్టి సీఎం కూడా అయ్యారు.

ఇక ఇప్పుడు తనను నాడు అడ్డుకున్న రాహుల్ ఏపీలో పాదయాత్ర నిర్వహిస్తాను అంటే జగన్ ఒప్పుకుంటారా.? ఒక‌ప్పుడు వ‌ద్ద‌ని చెప్పిన రాహుల్ నేడు జ‌గ‌న్ ని అనుమ‌తి అడ‌గాల్సి వ‌చ్చింది.మ‌రి రాహుల్ యాత్ర‌కు జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube