సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అతడు మరియు ఖలేజా లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత ఈ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది.
జనవరి 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ షూటింగ్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే పూర్తి అయిపోయింది.ఈ సినిమాకి మార్కెట్ లో ఉన్న క్రేజ్ అలాంటిది.
సుమారుగా 160 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు.
సినిమా విడుదలకు పట్టుమని రెండు నెలలు కూడా లేవు, కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి టీజర్ తప్ప మరొకటి రాలేదు.

అయితే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని ఈ దసరా కి విడుదల చేస్తారు అనే రూమర్ ఉండేది.మూవీ టీం నుండి కూడ అధికారిక ప్రకటన వస్తుంది అన్నారు.కానీ నిన్న నిర్మాత నాగ వంశీ ( Produced Naga Vamsi )దీని గురించి మాట్లాడుతూ ‘ సినిమా మీద అంచనాలు మామూలు స్థాయిలో లేదు.
ఆ అంచనాలను అందుకునే విధంగానే మేము ప్రయత్నాలు చేస్తున్నాం.మొదటి లిరికల్ వీడియో సాంగ్ లో చాలా తప్పులు ఉన్నాయి.ఆ తప్పులను సరి చెయ్యడానికే మాకు సమయం సరిపోయింది.అందుకే లిరికల్ వీడియో సాంగ్ ఇంత ఆలస్యం అయ్యింది.
కానీ ఈ మొదటి వారం లోనే కచ్చితంగా విడుదల చేస్తాము, అందులో ఎలాంటి సందేహం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.ఈ సినిమాకి థమన్( Thaman ) సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్ కి మరియు థమన్ ఫ్యాన్స్ కి చాలా కాలం నుండి కోల్డ్ వార్ నడుస్తుంది.

ఇప్పుడు నిర్మాత నాగవంశీ ఈ కామెంట్స్ చెయ్యడం తో, అన్ని సార్లు కరెక్షన్ చేసారంటే ఏ రేంజ్ లిరికల్ వీడియో ఇచ్చావు రా నాయనా, తేడా రావాలి నీకు ఇత్తడి అయ్యిపోతాది అంటూ సోషల్ మీడియా లో థమన్ ని ట్యాగ్ చేసి మహేష్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.మిగిలిన హీరోలకు ఇచ్చిన రేంజ్ మ్యూజిక్ మహేష్ కి ఈమధ్య థమన్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ చాలా కాలం నుండి నిరాశ లో ఉన్నారు.మహేష్ ఫ్యాన్స్ చేసే నెగటివ్ కామెంట్స్ పై థమన్ పలు సందర్భాల్లో కౌంటర్లు కూడా ఇచ్చాడు.
రేపు గుంటూరు కారం మొదటి పాట విడుదల అయ్యినప్పుడు ఫ్యాన్స్ నుండి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.