నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్( Congress ) పుంజుకుంటుంది అంటే ఎవరికి కనీసం నమ్మకం కూడా లేదు.ఎందుకంటే తనస్వయంకృత అపరాధం లా ఆంధ్రప్రదేశ్లో పార్టీని చంపేసుకున్న కాంగ్రెస్ ఇక పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల నుంచి అంతర్దానం అయిపోతుందనే భావించారు.
అయితే క్రమంగా తన గ్రాఫ్ పెంచుకుంటున్న కాంగ్రెస్ ఒకపక్క కర్ణాటకను, మరోపక్క తెలంగాణను కూడా హస్త గతం చేసుకోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం దృష్టి ఆంధ్ర ప్రదేశ్ పైనే పడిందట .
అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత పరిస్థితులు లేవు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్సెస్ టిడిపి – జనసేన గా నడుస్తున్న కాంబినేషన్ ను మాత్రం కాంగ్రెస్ త్రిముక పోటీగా మారుస్తుందన్న అంచనాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.ఎందుకంటే 151 ఎమ్మెల్యేలలో దాదాపు 60 నుంచి 70% సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసిపి( YCP ) మారుస్తుందని ప్రచారం జరుగుతున్న దరిమిలా వారిలో ఎవరికీ తెలుగుదేశం జనసేన టికెట్లను కేటాయించే పరిస్థితులు లేకపోవడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఆంధ్ర ప్రదేశ్ లో కనిపిస్తుంది.సరిగ్గా ఈ అవకాశాన్ని కాంగ్రెస్ రెండు చేతులా అందుపుచ్చుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.
భాజపా( BJP ) ఎలాగో ఆంధ్రప్రదేశ్ లో నోటతో పోటీపడుతుంది కనుక ఆ పార్టీలోకి చేరడానికి ఇష్టం లేని వారందరికీ కాంగ్రెస్ ప్రధాన ఆప్షనుగా మారే అవకాశం ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా.
దాంతో కీలకమైన నేతలు అందరిని కలుపుకొని గట్టిగా ప్రయత్నిస్తే కనీసం పది నుంచి 15 ఎమ్మెల్యేలను గెలుచుకున్నా కూడా కాంగ్రెస్ గేమ్ చేంజర్ గా మారటానికి అవకాశం ఉంటుంది.ఎందుకంటే ముక్కోణపు పోటీల్లో అతి తక్కువ సీట్లతోనే ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ఉన్నాయి.దాంతో కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలను గనక కాంగ్రెస్ గెలుచుకుంటే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పడానికి కాంగ్రెస్కు అవకాశం ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకులు మాట.ఇది కాంగ్రెస్కు అద్భుతమైన అవకాశమని, అందిపుచ్చుకుంటే కనుక అంతకుమించి కాంగ్రెస్ పుంజుకోవడానికి సరైన సమయం లేదన్నది కొంతమంది వాదన .