Sajjala Ramakrishna Reddy: భవిష్యత్తులో ఎస్సీ, మైనార్టీలపైనా సభలు పెడతాం - సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు.

రాష్ట్రంలో 85శాతం పైగా ప్రజలు ఎన్నుకున్న బీసీ వైసీపీ ప్రతినిధులు జయహో బీసీ సభకు వచ్చారు నిన్న బీసీ నేతలంతా అందరూ ఒకచోట చేరి జగన్ పై విశ్వాసం చూపించారు.

నిన్నటి జయహో బీసీ సభకు 80 వేల పైగా మంది బీసీ ప్రతినిధులు హాజరయ్యారు.సీఎం మాట్లాడుతుండగా కొందరు ముందుకు వెళ్లారు, కొంతమంది అటు ఇటూ వెళ్లిఉండవచ్చు.

కొందరు భోజనాలకు వెళ్లడం వల్ల కుర్చీలు ఖాళీ అయి ఉండవచ్చు.జయహో సభలో సీఎం మాట్లాడే టప్పుడు ఖాళీ కుర్చీలు ఉన్నయంటూ ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయి.

దింపుడు కళ్లెం ఆశతో జగన్ పై వ్యతిరేకత ఉన్నట్లు సృష్టిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గడానికి టీడీపీ నే కారణం.

Advertisement

ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ పై కేసు వేసి రిజర్వేషన్లను అడ్డుకున్నారు.రాష్ట్రానికి ప్రథమ శత్రువుగా చంద్రబాబు,టీడీపీ ఉంది.

భవిష్యత్తులో ఎస్సీ, మైనార్టీలు పైనా సభలు పెడతాం.రీజినల్ పార్టీలో నాయకుడికి సన్నిహితంగా ఉన్నవారు సభలో ఉండటం సహజమే.

రాష్ట్ర విభజన తీరును సవాల్ చేస్తూ సుప్రీం లో కేసుపై ఉండవల్లి చేసిన విమర్శలపై స్పెదించిన సజ్జల.విభజన తీరు అసంబద్దం అని సుప్రీంకోర్టు లో కేసు విచారణలో కేసు ఉంది.

కుదిరితే మళ్లీ ఎపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే మా పార్టీ విధానం.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మేము తొలి నుంచీపోరాడుతున్నాం.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

ఉండవల్లి పనిగట్టుకుని జగన్ వైపు చూపించినట్లు తెలుస్తోంది.అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ ,బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయి.

Advertisement

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ పోరాటం చేస్తోంది వైసీపీనే.మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే తొలుత స్వాగతించేది వైసీపీనే.

విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వాదనలు వినిపిస్తాం.రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి ,లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతాం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానం.రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారు.

విభజన చట్టంలో హామీల అమలు కోసం కాదు.విభజనచట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉంది.

రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది.రెండు రాష్ట్రాలు కలిసే దానికోసం వైకాపా పోరాటం చేస్తుంది.

స్కిల్ డెవలప్ మెంట్ పై అక్రమాలు రావాల్సిన సమయంలో బయటకు వస్తాయి.స్కిల్ డెవలప్ మెంట్ లో అక్రమాలపై విచారణ జరుగుతుంది.

చంద్రబాబు, లోకేష్ అక్రమాలు చేశారనే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.

తాజా వార్తలు