ఢిల్లీ లో జగన్ ధర్నా నేడే .. బిజెపి పెద్దలు కరుణిస్తారా ? 

ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుంటూ అనేక దాడులు చోటు చేసుకోవడం , అనేకమంది వైసిపి కార్యకర్తలు హత్యకు గురవడం,  కేసులు నమోదవడం వంటి పరిణామాలను వైసీపీ అధినేత జగన్( YS Jagan ) సీరియస్ గానే తీసుకున్నారు.

హత్యకు గురైన పార్టీ కార్యకర్తలను స్వయంగా వెళ్లి పరామర్శించడంతో పాటు,  ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ కార్యకర్తలలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ వచ్చారు .

అయినా ఈ హత్యలు , కేసుల వ్యవహారం కు పుల్ స్టాప్ పడకపోవడంతో,  దేశవ్యాప్తంగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పై చర్చ జరగాలని , ఈ విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు కలుగజేసుకునే విధంగా చేసేందుకు వ్యూహాత్మకంగా ఢిల్లీలో( Delhi ) ధర్నా కార్యక్రమానికి జగన్ పిలుపునిచ్చారు. 

నేడు పార్టీ కీలక నాయకులతో పాటు,  దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానాలు పంపించారు.నేడు ఢిల్లీలో ధర్నా కార్యక్రమం ద్వారా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను హైలెట్ చేయాలని జగన్ భావిస్తున్నారు టిడిపి కూటమి( TDP Alliance ) ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోనే రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని వైసిపి ఆరోపిస్తోంది.ఏపీలో శాంతిభద్రతలు లేవనే విషయాన్ని దేశం దృష్టికి తీసుకు వెళ్ళేందుకు ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో( Jantar Mantar ) పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు , ముఖ్య నాయకులతో కలిసి జగన్ ధర్నా నిర్వహించనున్నారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు.  టిడిపి కూటమి ప్రభుత్వం చేసిన దారుణకాండ పై కలిసివచ్చే పార్టీలన్నిటితో కలిసి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.అలాగే ఏపీలో శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదికి( PM Narendra Modi ) జగన్ లేఖ రాశారు.

Advertisement

  వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఇప్పటికే పరామర్శించారు.గవర్నర్ అబ్దుల్ నజీర్ ను  కూడా కలిసి రాష్ట్రంలో విధ్వంస కాండపై ఫిర్యాదు చేశారు.నేటి ధర్నాతో ఏపీలో పరిస్థితులు మారుతాయని , వైసిపి నాయకులే టార్గెట్ గా చేస్తున్న దాడులకు అడ్డుకట్టపడే విధంగా కేంద్ర బిజెపి పెద్దలు కలుగజేసుకుంటారనే ఆశాభావంతో జగన్ ఉన్నారు.

మేకిన్ ఇండియాకు సాయపడండి.. యూఎస్ డిఫెన్స్ కంపెనీలతో రాజ్‌నాథ్ సింగ్
Advertisement

తాజా వార్తలు