జ్యోతి లక్ష్మి కి జయ మాలిని కి మధ్య ఇంత గొడవ ఎందుకు జరిగింది ?

జయమాలిని జ్యోతి చిత్ర ఈ రెండు పేర్లు గతంలో కొన్నాళ్ళు వెనక్కి వెళితే కుర్రకారును ఉర్రూతలూగించాయి.జ్యోతిలక్ష్మి, జయమాలిని అక్కాచెల్లెళ్లు అనే విషయం మనందరికీ తెలిసిందే.

ఇందులో జ్యోతిలక్ష్మి అక్కయితే జయమాలిని చెల్లెలు.1970లో జ్యోతిలక్ష్మి చాలా బిజీగా ఉండేది.ఆమె తెలుగు, తమిళ, మలయాళ కన్నడ, హిందీ పరిశ్రమలో వందల సంఖ్యలో సినిమాల్లో క్లబ్ డాన్సర్ గా ఐటం నెంబర్ గా కనిపించింది.

ఇక ఆమె 2016లో కన్నుమూయగా చివరి దశలో ఎక్కువగా కుటుంబానికి పరిమితమైంది.జయలక్ష్మి కుటుంబంలో పెద్దమ్మాయి కాగా జయమాలిని మాత్రం అందరికంటే చిన్నమ్మాయి.జయమాలిని ఎంట్రీ ఇచ్చిన తర్వాత జ్యోతిలక్ష్మికి సినిమాలు తగ్గుతూ వచ్చాయి.

మొదట్లో తమిళంలోనే వీరు ఎక్కువ హీరోయిన్స్ గా కూడా నటించారు.చేసిన తక్కువ సినిమాలతోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Why Was There Such A Fight Between Jyoti Lakshmi And Jaya Malini Details, Jyoti

కానీ వీరి హైట్, పర్సనాలిటీ ప్రకారం కొందరు దర్శకులు వీరిని వ్యాంప్ పాత్రలకు పరిమితం చేయగా ఆ తర్వాత కాలంలో ఎక్కువగా అలాంటి పాత్రలే చేయాల్సి వచ్చింది.ఇలా జ్యోతిలక్ష్మి, జయమాలిని ఇద్దరు కూడా ఇండియా మొత్తంలో చాలా భాషల్లో వందల సినిమాల్లో ఐటెం గర్ల్ గా నటించారు.ఆడపిల్లలు ఎక్కువగా ఉండడంతో జయలక్ష్మిని ఆమె మేనత్త దత్తత తీసుకుందట.

Advertisement
Why Was There Such A Fight Between Jyoti Lakshmi And Jaya Malini Details, Jyoti

అలాగే కొన్నేళ్లపాటు అసలు అక్క ఉందనే విషయం కూడా జయమాలిని కి తెలిసేది కాదు.

Why Was There Such A Fight Between Jyoti Lakshmi And Jaya Malini Details, Jyoti

జయలక్ష్మి కి జయమాలిని కుటుంబాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉండేదట.కానీ ఆస్తులు మొత్తం కరిగిపోయి, అంతా పోయాక ఒకరిపై ఒకరు ప్రేమను బయటపెట్టుకున్నారు.జయలక్ష్మి చనిపోతే చివరికి అంతిమ సంస్కారాలు సైతం జయమాలిని దగ్గరుండి మరి చూసుకున్నారు.

జయలక్ష్మి మేనత్త సరిగ్గా ఆస్తులను నిలపలేదని, జయమాలిని మాత్రం తల్లి సంరక్షణలో ఉంది కాబట్టి అని చక్కగా సెట్ చేసిందనే కోపం ఎక్కువగా ఉండేదట.అలా అక్క చెల్లెలు ఎన్నో ఏళ్ల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు