వినయ్ రాయ్( Vinay Roy )… ఈ నటుడు మీలో ఎంత మందికి గుర్తున్నాడో చెప్పండి.హనుమాన్ సినిమా( Hanuman movie ) విజయవంతం అయ్యాక అందరూ ఈ నటుడుని గుర్తు పడుతున్నారు.
కానీ దాదాపు 15 ఏళ్ల క్రితం 2008లో వాన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వినయ్.కానీ ఆ తర్వాత పెద్దగా తెలుగు చిత్రాల్లో కనిపించలేదు.
హనుమాన్ ఖచ్చితంగా వినయ్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు.ప్రస్తుతం వినయ్ కి చేతినిండా సినిమాలు ఉన్నాయి.
కానీ 2007లో మొట్టమొదటిసారి యాక్టింగ్ లోకి వచ్చిన వినయ్ కి మాత్రం సరైన గుర్తింపు ఇప్పటి వరకు రాలేదని చెప్పుకోవాలి.ముంబైలో( Mumbai ) పుట్టి పెరిగాడు వినయ్ అక్కడే మోడలింగ్ లో రాణించాడు.
చూడ్డానికి చాక్లెట్ బాయ్ లాగా ఉండి నటుడుగా మరియు హీరోగా రాణించాలని తొలుత ప్రయత్నాలు చేశాడు.కానీ తను నటించిన సినిమాలు పరాజయం పాలు కావడంతో అతనిని ఎవరూ పెద్దగా సినిమాల్లోకి తీసుకోలేదు ఒక సినిమా నటిస్తే రెండేళ్ల గ్యాప్ అలా ప్రతిసారి ఒక్కో చిత్రానికి రెండు మూడేళ్ల గ్యాప్ వచ్చి ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత బిజీ అవుతున్నాడు.తమిళ్ లోనే ఎక్కువగా చిత్రాలు చేసిన వినయ్ ఇంగ్లీషులో కూడా ఒక సినిమా చేశాడు.మలయాళ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.అయితే చాలా తక్కువ మాట్లాడుతూ సైలెంట్ గా నటించడంలో వినయ్ దిట్టగా ఉన్నాడు.తను చేసిన సినిమాలు అన్నీ కూడా ఎక్కువగా హడావిడి ఉన్న సినిమాలు కాదు.
ప్రస్తుతం రవితేజ ఈగల్( Ravi Teja, Eagle ) సినిమాలో కూడా వినయ్ ఉన్నాడు.హనుమాన్ సినిమా వినయ్ ని మరోమారు తెలుగు ప్రేక్షకులకు గుర్తు చేయగా ఈగల్ చిత్రం కనుక విజయవంతం సాధిస్తే ఖచ్చితంగా తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది.ఏడాది నాలుగు సినిమాల్లో కనిపించబోతున్న వినయ్ కి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అయితే వస్తున్నాయి.కాకపోతే చాలా లేటుగా అతనిలోనే టాలెంట్ ని తమిళ మరియు తెలుగు పరిశ్రమలు గుర్తించాయి.
టాలెంట్ ఉంటే ఏ టైం అయినా సరే ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం సాధించాల్సిందే.ఇప్పుడు వినయ్ కి కూడా మంచి టైం వచ్చింది.కానీ ప్రశాంత్ వర్మ వినయ్ ని గుర్తించడంలో మాత్రం సఫలమయ్యాడు.