అవకాశాలు వచ్చినా.. సుజాత హీరోయిన్ గా ఎందుకు ఎదగలేకపోయింది?

సుజాత.తెలుగు సినిమా పరిశ్రమలో పద్దతికి ప్రతిరూపంగా ఉండే నటీమణి.40 ఏండ్ల క్రితం ఆమె సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది ఓ మాట అనుకునేవారు.

అసలు ఈమె సినిమాల్లోకి వచ్చి ఎలా ఉంటుంది? అని.వాస్తవానికి తన కుటుంబానికి సినిమాలతో ఎలాంటి సంబంధం కూడా లేదు.ఆమె కూడా ఒక నటిలా ఎప్పుడూ ఉండలేదు.

నిజానికి ఆమె కెరీర్ హీరోయిన్ గా మొదలయ్యింది.కానీ పెద్ద హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది.

అయినా పెద్ద హీరోలంతా తనను ఎంతో గౌరవంగా చూసేవారు.తోటి నటీనటులతో ఆమె ఎంతో అభిమానంగా ఉండేది.

గొప్ప నటి అయిన సుజాత.కరుణ రసాన్ని కేవలం కన్నీళ్లతో అత్యంత సహజంగా చూపించేది.తన హావభావాలలను ఈజీగా పలికించేది కూడా.నిజానికి ఆమెకు సినిమాల్లోకి రావాలని ఆసక్తి లేదు.

Advertisement
Why Sujatha Career Fall Down After Getting Movies , Sujatha, Director Balachande

కానీ పరిస్థితుల కారణంగా ఈ రంగంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది.ఆమెను సినిమా పరిశ్రమకు దిగ్గజ దర్శకుడు బాలచందర్ పరిచయం చేశాడు.

హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నా.ఆమెకు సినిమా వాళ్ల పద్దతి అంతగా నచ్చేది కాదు.

తనలోతానే బాధపడేది.అందుకే ఆమె పలు సినిమాలను వదులుకుంది కూడా.

ఆ కారణంగానే హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది.

Why Sujatha Career Fall Down After Getting Movies , Sujatha, Director Balachande
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

దాస‌రి నారాయ‌ణ రావు సుజాత పరిస్థితి గమనించారు.తన సినిమాల్లో మంచి పాత్రలు ఇచ్చారు.సుజాత, దాసరి అనగానే వారు తీసిన ఏడంతస్తుల మేడ అనే సినిమా గుర్తుకు వస్తుంది.

Advertisement

అటు చంటి సినిమాలో వెంకటేష్ తల్లిగా అద్భుతంగా నటించింది.ఆ రోజుల్లో ఎమోషన్ పాత్రలు అంటేనే సుజాత ముందుగా గుర్తుకు వచ్చేది.

తెలుగు ఒక్కటే కాదు.మలయాళం, కన్నడ, తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది.

అన్ని పరిశ్రమల నుంచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.సహజత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించేది సుజాత.

తన మనసుకు నచ్చని సినిమాలను చేయకపోవడం మూలంగానే తను ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది.

తాజా వార్తలు