దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలో తెలుసా..?

మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ ఏది అంటే విజయదశమి( Vijayadashami ) అని చెప్పవచ్చు.

ఈ పండుగ వచ్చింది అంటే చాలు ఒక ఊరు వాడా పట్టణాలన్నీ కూడా సందడిగా నెలకొంటాయి.

ఇక పై చదువులు, వ్యాపారం, ఉద్యోగం ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా కుటుంబ సమేతంగా సొంత ఊరికి చేరుకుంటారు.దీంతో పల్లెలన్నీ పండుగ వాతావరణం గా మారిపోతాయి.

అయితే విజయదశమినాడు కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి.అవి ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారు.

అందులో భాగంగానే నిరుపేదలు కూడా ఖచ్చితంగా కొత్త బట్టలు ధరిస్తారు.అలాగే దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

Advertisement

అలాగే శుభాకాంక్షలు చెప్పుకుంటూ జమ్మి ఇచ్చుకుంటారు.గ్రామస్తులందరూ ఒకటిగా కలిసి వెళ్లి జమ్మికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.

అంతేకాకుండా జమ్మి ఆకులు( Shami Tree ) తమతో పాటు ఇంటికి తెచ్చుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.ఇక విజయదశమి నాడు అతి ముఖ్యమైన ఘట్టం పాలపిట్టను( Blue Jay Bird ) చూడడం అని చెప్పవచ్చు.అయితే ఆ రోజు ఆ పక్షిని చూస్తే ఏడాదంతా మంచి జరుగుతుందని అందరు ప్రజలు నమ్ముతారు.

అలాగే పాలపిట్టని చూస్తే పాపలు తొలగిపోయి, సిరిసంపదలు లభిస్తాయని ఆచారం ఇప్పటివరకు కొనసాగుతుంది.అయితే పాలపిట్ట సాధారణ రోజులు కనిపించినా, కనిపించకపోయిన దసరా రోజు( Dasara ) మాత్రం ప్రజలకు కచ్చితంగా దర్శనమిస్తుంది.

అయితే పాలపిట్టను చూడడానికి కారణం ఏంటి అంటే ఓ కథ ఉందని చెబుతారు.

How Modern Technology Shapes The IGaming Experience
చిన్న పిల్లలు తెలిసి తెలియక ఇలా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త..?

పూర్వం పాండవులు( Pandavas ) జూదం ఆడి ఈ రాజ్యాన్ని కోల్పోయాక కురుపాండవుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో వారికి దారిలో పాలపిట్ట కనిపిస్తుంది.దీంతో వారు శుభం కలుగుతుందని నమ్మారు.పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన రోజు విజయదశమి పండుగ.

Advertisement

విజయదశమి రోజున పాలపిట్ట కనిపించడంతో తమకు అన్ని శుభాలు, విజయాలు కలుగుతాయని నమ్మారు.అందుకే కురుక్షేత్రం యుద్ధం జరగడం, పాండవులు విజయం సాధించడం జరిగింది.

అందుకే అప్పటినుంచి ప్రతి ఒక్కరు కూడా విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు.

తాజా వార్తలు