నాగచైతన్య తండేల్ ను సంక్రాంతి రేసులో నిలపడం వెనుక అసలు రీజన్ ఇదేనా?

టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య(naga chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నాగ చైతన్య ప్రస్తుతం తండేల్(thandel) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో సాయి పల్లవి (Sai Pallavi)హీరోయిన్ గా నటిస్తోంది.చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.దాదాపుగా 80 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాలో నిర్మిస్తున్నారు.80 కోట్లు అంటే మరీ చాలా రిస్క్ చేస్తున్నారేమో అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తండేల్ సినిమా కోసం గీతా సంస్థ భారీగా ఖర్చు చేస్తోంది.

80 కోట్లకు పైగానే నిర్మాణ వ్యయం అవుతోంది.వడ్డీలు, ప్రింట్, పబ్లిసిటీ వుండనే వుంటాయి.ఈ సినిమాకు నాన్ థియేటర్ మొత్తం కలిపినా 60 కోట్లకు లోపే వస్తోంది.

శాటిలైట్ కాలేదు.మిగిలినవి డీల్స్ సెట్ అయ్యాయి.

Advertisement

ఇప్పటికి 50 కోట్ల వరకు రికవరీ వచ్చింది.మరో అరేడు కోట్లు వస్తాయనే నమ్మకం వుంది.

అలా అయినా కూడా ఇంకా పాతిక నుంచి ముఫై కోట్లకు పైగా డెఫిసిట్ వుంటుంది.అంటే సినిమాను తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిపి అ మేరకు మార్కెట్ చేయాల్సి వుంటుంది.

సాయి పల్లవి వుంది కనుక అదర్ స్టేట్స్ లో కాస్త మంచి మార్కెట్ నే వుంటుంది.

ఎలా లేదన్నా రెండు తెలుగు రాష్ట్రాలు(Telugu states) కలిపి 25 కోట్ల వరకు వసూలు చేయాల్సి వుంటుంది.సినిమా హిట్ అయితే ఇవేమంత పెద్ద నెంబర్లు కాదు.పైగా ఇప్పుడు అదనపు రేట్లు, అదనపు అటలు ఎలాగూ ఇచ్చేస్తున్నారు కనుక, అటు వైపు నుంచి సమస్య వుండదు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

కానీ సినిమా కాస్త అటు ఇటుగా వుంటే మాత్రం రిస్కే.బహుశా అదే అలోచనతో కావచ్చు, సినిమాను సంక్రాంతి(sankranthi) బరిలో దింపాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.సినిమా యావరేజ్ గా వున్నా సంక్రాంతి బరిలో నడిచిపోతుంది.

Advertisement

అదే గీతా స్ట్రాటజీ కావచ్చని గట్టిగా వినిపిస్తోంది.

తాజా వార్తలు