మంత్రులు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేయడం ఏంటీ?

ఏపీ శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లుపై తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది.

ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టేందుకు మండలి చైర్మన్‌ అనుమతించక పోవడంతో మంత్రులు పలువురు వెళ్లి పోడియం వద్ద ఆందోళనకు దిగారు.

ఈ సందర్బంగా చైర్మన్‌ మాట్లాడుతూ మంత్రులు ఇలా పోడియం వద్దకు వచ్చి ఆందళనలు చేయడం ఏమాత్రం సరి కాదని, ఇలా ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా అంటూ ప్రశ్నించాడు.సభను అడ్డుకునేందుకు మంత్రులు ప్రయత్నించడం సరైన విధానం కాదన్నాడు.

ప్రభుత్వంలో ఉన్న వైకాపాకు మండలిలో బలం చాలా తక్కువగా ఉంది.తెలుగు దేశం పార్టీకి మెజార్టీ ఎక్కువగా ఉంది.

దాంతో మండలిలో ఏ బిల్లు పెట్టినా కూడా వైకాపాకు తెలుగు దేశం పార్టీ అడ్డు పడుతూనే ఉంది.నేడు మండలి మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించగా తెలుగు దేశం పార్టీ అడ్డుకుంది.

Advertisement

ఈ నేపథ్యంలోనే సభను అడ్డుకునేందుకు వైకాపా మంత్రులు ప్రయత్నించారు.సభ కార్యక్రమాలు అడ్డుకునేందుకు పోడియం వద్ద వెళ్లారు.

సోషల్‌ మీడియాలో కూడా మంత్రులు ఇలా పోడియం వద్దకు వెళ్లడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు