కొత్త డైరెక్టర్స్ తో మన స్టార్ హీరోలు ఎందుకు సినిమాలు చేయరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరో లు అందరూ కూడా ఒక కొత్త డైరెక్టర్ కి అయితే అవకాశం ఇవ్వడం లేదు.

కారణం వాళ్ల ఇమేజ్ అని అందరు చెప్తూ ఉంటారు కానీ ఒక కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తేనే కదా వాళ్ల టాలెంట్ కూడా నిరూపించుకునేది అని మరి కొందరు అంటున్నారు.

అయితే మలయాళం లో మోహన్ లాల్, మమ్ముట్టి( Mohanlal, Mammootty ) లాంటి వాళ్ళు కొత్త డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో కూడా సినిమాలు చేస్తారు కానీ ఇక్కడ మాత్రం అలా లేదు ఆ డైరెక్టర్ ఫస్ట్ వేరే వాళ్ళతో సినిమా తీసి తన టాలెంట్ తను నిరూపించుకున్న తర్వాత అప్పుడు మన స్టార్ హీరోలు డేట్స్ ఇస్తు ఉంటారు.ఇక ఒకసారి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాక మీరు వాళ్ళకి డేట్స్ ఇవ్వడం దేనికి వాళ్ళకి ఎవరైనా ఛాన్స్ ఇస్తారు కానీ మొదట అతని టాలెంట్ ను చూసి సినిమాలు ఇచ్చే హీరో లు కావాలి అంటూ చాలా మంది యంగ్ డైరెక్టర్స్( Young Directors ) వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ స్టార్ హీరోలు అందరూ అంతే.అయితే ఇదే టైం లో కొద్ది సంవత్సరాల క్రితం బాలయ్య లయన్ అనే సినిమా తో ఒక కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు అయిన కూడా ఆయన తన టాలెంట్ ని నిరూపించు కాలేకపోయాడు.

ఇక దానితో వేరే హీరోలు కూడా ఎవరికీ ఛాన్స్ ఇవ్వడం లేదు.

Advertisement

అందుకే కొత్త డైరెక్టర్లకి కనిపిస్తున్న ఒక ఒకే ఆప్షన్ నాని, రవితేజ( Nani, Ravi Teja ).వీళ్లిద్దరూ మాత్రమే ఇపుడు కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తు వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రస్తుతం వీళ్ళ కోసమే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా మంచి కథలు రెఢీ చేసుకుంటున్నారు.అందుకే రీసెంట్ టైమ్స్ లో వీళ్లిద్దరూ కూడా మంచి కథలు చేస్తూ ఇండస్ట్రీ లో ముందుకు దూసుకుపోతున్నారు.

ఇక రీసెంట్ గా నాని దసర సినిమాతో కొత్త డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) అనే అబ్బాయి కి ఛాన్స్ ఇచ్చాడు.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుంది అని నాని తో పాటు అందరూ కూడా వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు