టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా గురించి మనందరికీ తెలిసిందే.ఇందులో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించింది.
ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని క్రియేట్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్.
మొదట నాగ్ అశ్విన్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.అలా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అయితే తెలుగులో ఎన్ని బయోపిక్ లు వచ్చినా కూడా మహానటి లాంటి బయోపిక్ ఇప్పటివరకు రాలేదు అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి జీవిత కథను కళ్లకు కట్టినట్టుగా చూపించారు నాగ్ అశ్విన్.
సినిమాకు గాను పలువురు ప్రముఖుల ప్రశంసల వర్షం కురిపించారు.ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇందులో జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించి అలరించాడు.
ఈ సినిమాలో నాగేశ్వరావు స్థానంలో నాగచైతన్యను చూపించిన విషయం తెలిసిందే.కానీ ఎన్టీ రామారావు పాత్రలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నటించలేదు.
దీనితో నాగ్ అశ్విన్ ఎందుకు అలా చేసారు అని ప్రేక్షకులు అనుకున్నారు.

అయితే ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్.ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ను కూడా సంప్రదించాలని తెలిపారు.అయితే ఎన్టీఆర్ ఒప్పుకుని ఉంటే ఈ సినిమాలో ఎక్కువగా ఎన్టీ రామారావు సావిత్రి మధ్య సన్నివేశాలు ఉండేవి అని చెప్పుకొచ్చారు.
అదేవిధంగా జెమినీ గణేషన్ రోల్ కోసం సావిత్రి రోల్ కోసం చాలామంది వెతికామని తెలిపారు నాగ్ అశ్విన్.ఈ సినిమాలో మొదట జెమినీ గణేషన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండ సంప్రదించామని చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్.