అంతక్రియల తర్వాత వెనక్కి తిరిగి ఎందుకు చూడకూడదు..?

మన భారతదేశంలో జీవిస్తున్న ప్రజలు చాలా రకాల సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే హిందువుల సంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార సంప్రదాయాలు ఉంటాయి.

ఇప్పటికీ చాలా మంది ప్రజలు వాటన్నిటినీ పాటిస్తూ ఉన్నారు.అలాగే అంతక్రియలలో ( Funeral ) కూడా ఆచార సంప్రదాయాలను చాలా మంది ప్రజలు పాటిస్తారు.

అలాగే మన దేశంలో ఉన్న ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఈ ఆచార సంప్రదాయాలు మారుతూ ఉంటాయి.ఒక ప్రాంతంలో ఇలా చేస్తే మంచిదని చెబితే మరో ప్రాంతంలో ఇలా చేస్తే చెడు జరుగుతుందని నమ్మేవారు కూడా ఉన్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే చనిపోయిన వ్యక్తి అంతక్రియలు ఈ సాంప్రదాయాల ప్రకారమే చేయాలని చాలా రకాల సంప్రదాయాలను పాటించేవారు ఇప్పటివరకు మన దేశంలో చాలా మంది ప్రజలు ఉన్నారు.ఇవన్నీ పాటిస్తేనే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.అయితే అంతక్రియల తర్వాత వెనక్కు తిరిగి చూడకూడదు అని చాలామంది ప్రజలు చెబుతూ ఉంటారు.

Advertisement

అసలు అలా ఎందుకు తిరిగి చూడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చెప్పాలంటే అంతిమ సంస్కారాలు, ఆత్మ మరణాంతరం జీవితం గురించి గరుడ పురాణంలో( Garuda Puranam ) ఉంది.ఈ గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి అంతక్రియల నుంచి తిరిగి వస్తున్నప్పుడు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదు.అలా చూస్తే మరణించిన వ్యక్తి ఆత్మ చూసే వారితో ప్రేమలో పడుతుంది.

తన నిష్క్రమణ కారణంగా ఆ వ్యక్తి మాత్రమే విచారంగా ఉన్నాడని ఆత్మ భావిస్తుంది.అటువంటి పరిస్థితిలో ఆ ఆత్మ శాంతిని పొందదు.ఆ వ్యక్తితో అనుబంధాన్ని పెంచుకుంటుంది.

ఆ వ్యక్తి ఇంటికి రావాలని కోరుకుంటుంది.అందుకే అంతక్రియలు జరిపిన తర్వాత వెనుకకు చూడకూడదని పండితులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్6, బుధవారం2024
Advertisement

తాజా వార్తలు