దసరా పాన్ ఇండియా ప్రమోషన్స్‌ లో కనిపించని కీర్తి సురేష్‌.. కారణం అదేనా?

నాని ( Nani )హీరోగా కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా రూపొందిన దసరా( dasara ) సినిమా ఈనెల 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల చేయాలని నాని ఆశ పడుతున్నాడు.

అందుకు తగ్గట్లుగా పాన్‌ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మొన్న నార్త్‌ ఇండియాలో సందడి చేసిన దసరా టీమ్ తాజాగా బెంగళూరు లో ల్యాండ్ అయ్యింది.

అయితే నాని తో పాటు కీర్తి సురేష్ లేకపోవడం పట్ల చర్చ జరుగుతోంది.ఎందుకు నాని తో పాటు కీర్తి సురేష్ ప్రమోషన్ లో పాల్గొనడం లేదు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటూ.

ఆ మధ్య కీర్తి సురేష్ నటించిన సినిమా లు నిరాశ పర్చాయి.అందుకే ఇప్పుడు ఆమె ప్రమోషన్‌ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Why Keerthy Suresh Not Participating In Nani Dasara Movie Promotions , Keerthy S
Advertisement
Why Keerthy Suresh Not Participating In Nani Dasara Movie Promotions , Keerthy S

పాన్ ఇండియా హీరోయిన్‌ గా మెప్పించిన కీర్తి సురేష్ గతంలో భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.కానీ గడచిన కొన్నాళ్లుగా కీర్తి సురేష్ యొక్క టైమ్ సరిగా లేదా అనిపిస్తుంది.అందుకే ఆమె సినిమా లు సరిగా ఆడలేదు.

అంతే కాకుండా ఆమె యొక్క క్రేజ్ కూడా తగ్గింది.భారీ ఎత్తున కీర్తి సురేష్ దసరా సినిమాపై అంచనాలు పెట్టుకుని ఉంది.

Why Keerthy Suresh Not Participating In Nani Dasara Movie Promotions , Keerthy S

కనుక దసరా సినిమా ప్రమోషన్ లో ఆమె పాల్గొనాల్సి ఉంది.కానీ నెగటివ్ టాక్ ఏమైనా వస్తుందా అనే ఉద్దేశ్యంతో ఆమె అక్కడ ప్రమోషన్ కు దూరంగా ఉంటుంది.తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ కు మాత్రం కీర్తి సురేష్ అందుబాటు లో ఉండే అవకాశాలు ఉన్నాయట.

మొత్తానికి పాన్‌ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ కీర్తి సురేష్ తనను తాను ప్రమోట్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపించలేదు.సినిమా విడుదల అయిన తర్వాత కచ్చితంగా తన గురించి అందరూ చర్చించుకుంటారనే ధీమాతో ఆమె ఉందట.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు