ఉగాది నీ తొలి పండుగ అని ఎందుకు అంటారు తెలుసా..?

మనిషి ఎప్పుడూ కాలంతో పాటు పరిగెడుతూనే ఉంటాడు.దాన్ని ఆపడం, దానికి ఎదురు వెళ్లడం ఎవరి తరము కాదు.

అయితే మనిషి తన అవసరాలకు అనుగుణంగా కాలాన్ని విభజిస్తాడు.అలా కాలాన్ని పరిశీలించుకుంటూ, దానికి తగ్గట్టు నడుచుకుంటూ, తన బుద్ధికి పదును పెడుతూ ఉంటాడు.

కాలానికి తగ్గట్టుగా కర్మలు నేర్చుకోవడం తోనే మనిషి జ్ఞాన ప్రయాణం ప్రారంభమవుతుంది.కాల మహిమను గుర్తు చేసుకుంటూ తెలుగు వారు చేసుకునే మొదటి పండుగ ఉగాది( Ugadi ) అని నిపుణులు చెబుతున్నారు.

అనాదిగా వస్తున్న ఈ ఉగాది "యుగాది" అన్న సంస్కృత పదం నుంచి వచ్చింది.మన వేదాలకు మంత్ర సృష్టి జరిగిన రోజు, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజు కాలం వసంతంలోకి అడుగుపెట్టిన రోజునే ఉగాది పండుగను కొత్త సంవత్సరాదిగా జరుపుకుంటారు.

Why Is Ugadi Called First Festival What Is The Uniqueness Of Ugadi Festival Deta
Advertisement
Why Is Ugadi Called First Festival What Is The Uniqueness Of Ugadi Festival Deta

మన సంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది.అందులోనూ ఉగాది అయితే దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది.వసంత రుతువు వచ్చిందని తెలియజేసే పండుగ పచ్చడి( Ugadi Pachadi ) ఒక ఔషధం.

ఉగాది నాటికి చుట్టూ పక్కల ఏ చెట్టును చూసినా లేక ఆకులతో పచ్చగా కనివిందు చేస్తూ ఉంటాయి.ఆ సంతోషం కోయిల పాటల్లో నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది.

వసంతుడి ఆటలు చూసి మనసు పరవశించి పోతుంది.ఉగాది వెనుక ఉన్న అసలైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉగాది పండుగ వెనుక ఉన్న కథను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతూ ఉంటారు.

Why Is Ugadi Called First Festival What Is The Uniqueness Of Ugadi Festival Deta
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ ఆయుష్షు అని అర్ధాలు ఉన్నాయి.వీటికి అది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్షుకి మొదటి రోజునే ఉగాదిగా మారిందని చెబుతూ ఉన్నారు.చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కలియుగం ( Kaliyug ) మొదలైందని త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని కూడా చెబుతూ ఉన్నారు.

Advertisement

ఈ రోజే శ్రీమహా విష్ణువు( Sri Mahavishnu ) మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాలలో ఉంది.బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజు ఉగాది అని కూడా చెబుతారు.

మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్టించాడనేది కూడా ప్రచారంలో ఉంది.ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది.

కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగగా చెబుతారు.అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఉగాదిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

తాజా వార్తలు