పూర్ణకుంభంతో స్వాగతం పలకడానికి గల కారణం ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కలశం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

కలశాన్ని త్రిమూర్త్యాత్మకంగా భావించి పూజ చేయడంవల్ల మనం చేసే పనిలో విజయం కలగాలని హిందువులు శుభకార్యం చేసేటప్పుడు ఈ కలశాన్ని ఏర్పాటు చేయడం చేస్తుంటారు.

సాధారణంగా కలశాన్ని రాగి లేదా ఇత్తడి పాత్రలో నీటిని నింపి ఆపై మామిడాకులు పెట్టి తరువాత కొబ్బరికాయను పెడతారు.ఈ విధంగా ఏర్పాటు చేసిన కలశానికి తెలుపు రంగు దారంతో కలశం చెంబు చుట్టూ చుట్టి కలశాన్ని ఏర్పాటు చేస్తారు.

ఈ విధంగా ఇత్తడి లేదా రాగి పాత్రను నీటితో  లేదా బియ్యంతో నింపినప్పుడు అది పూర్ణకుంభంగా పిలువబడుతుంది.ఈ విధమైనటువంటి పూర్ణకుంభం దివ్యమైన ప్రాణశక్తితో నింపబడతుంది.

ఈ విధమైనటువంటి శక్తి వల్ల అద్భుతమైన పనులు చేయడానికి మన శరీరానికి శక్తి కలుగుతుంది.ఈ విధంగా పూర్ణకుంభం ఏర్పాటు చేసి మనం ఏదైనా శుభకార్యాలను నిర్వహిస్తే తగినంత శక్తి మనలోనికి ఆహ్వానించడానికి ఈ విధమైనటువంటి పూర్ణకుంభం ఏర్పాటు చేస్తారు.

Why Is Poornakumbh Welcomed In Temples Poornakumbh, Temples, Welcome, Pooja, Sag
Advertisement
Why Is Poornakumbh Welcomed In Temples Poornakumbh, Temples, Welcome, Pooja, Sag

ఈ విధమైనటువంటి పూర్ణకుంభం ఏదైనా వివాహ శుభకార్యాలలో లేదా పూజా సమయంలో, గృహప్రవేశ సమయంలో లేదాగొప్ప మహాత్మలకు స్వాగతం పలకడానికి పండితులు ఈ విధమైనటువంటి పూర్ణకుంభం ఏర్పాటు చేస్తారు.అయితే ఈ పూర్ణకుంభం లో ఉండేటటువంటి నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి తొలి అడుగు.ఈ సృష్టిలో ఏ చిన్న ప్రాణి జీవించాలన్న నీరు మనకు ఎంతో అవసరం.

అదే విధంగా ఈ పూర్ణకుంభం లో ఏర్పాటు చేసిన మామిడి ఆకులు, కొబ్బరికాయ ఈ సృష్టికి చిహ్నంగా చెప్పబడతాయి.అలాగే ఈ కలశానికి చుట్టిన దారం ఈ సృష్టిలో అన్నింటిని బంధించి ప్రేమను సూచిస్తుంది.

అందుకోసమే కలశాన్ని శుభ సూచికంగా పరిగణిస్తారు.పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేస్తున్న సమయంలో అమరత్వాన్ని ప్రసాదించే భగవంతుడు కలశంతో ప్రత్యక్షమయ్యాడు కనుక కలశం అమరత్వాన్ని సూచిస్తుందని పండితులు చెబుతున్నారు.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు