రాజశేఖర్ హీరో గా మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎందుకు మారాల్సి వచ్చింది ?

అంకుశం, అల్లరి ప్రియుడు, సింహరాశి గోరింటాకు అంటే ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజశేఖర్( Rajasekhar ).

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ నటుడుకి ఉండేది.

ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు పరిశ్రమలో పోటీ కూడా ఉండకపోయేవారు లేరు.మనం కాలక్రమైనా చిరంజీవి , నాగార్జున, బాలకృష్ణ( Chiranjeevi, Nagarjuna, Balakrishna ) మంచి సినిమాలతో పోటీగా వచ్చారు.

వారు మంచి సినిమాలు తీస్తూ ఉంటే రాజశేఖర్ చెత్త సినిమాలు తీస్త కెరీర్ పాడు చేసుకున్నాడు.దానివల్ల అతడి కెరీర్ గ్రాఫ్ పడిపోయింది.

రాజశేఖర్ తీసిన రీసెంట్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.వాటిలో కొన్ని వివాదాల కారణంగా ఆగిపోయాయి.ఉదాహరణకు, అతని చిత్రం గరుడ వేళ పాజిటివ్ రివ్యూలను అందుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది.2022లో విడుదలైన శేఖర్ సినిమా ( Shekhar movie )ఫ్లాప్ అయింది.ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా సినిమాలు చేయకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రం నటించేందుకు సిద్ధమయ్యాడు.

Why Hero Rajasekhar Turns Character Artist, Hero Rajasekhar , Chiranjeevi, Nagar
Advertisement
Why Hero Rajasekhar Turns Character Artist, Hero Rajasekhar , Chiranjeevi, Nagar

ఈ సీనియర్ హీరో ఇప్పుడు "ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్" ( Extraordinary Man )అనే చిత్రానికి సంతకం చేశాడు, ఇందులో అతను ప్రధాన కథానాయకుడు నితిన్‌ను ఎదుర్కొనే ఒక నెగెటివ్ రోల్‌లో నటించనున్నాడు.రాజశేఖర్ కుమార్తె శివాని కూడా నటి.ఆమె ఇటీవల మాట్లాడుతూ తన తండ్రికి ఎప్పుడూ విలన్ పాత్రలు చేయడం పట్ల మక్కువ ఉందని వెల్లడించింది.విజయ్ సేతుపతి, అరవిందస్వామి, జగపతిబాబు వంటి పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయిన నటులను తండ్రి బాగా మెచ్చుకుంటాడని చెప్పింది.

నితిన్ ఆఫర్‌ని అంగీకరించడానికి తన తండ్రి చాలా ఉత్సాహంగా ఉన్నాడని, అలాంటి పాత్రలో నటించడం చాలా ఇష్టం అని ఆమె తెలిపింది.

Why Hero Rajasekhar Turns Character Artist, Hero Rajasekhar , Chiranjeevi, Nagar

ఈ నెల 24న విడుదల కానున్న కోటబొమ్మాళి( Kotabommali ) అనే సినిమాలో శివానీ నటిస్తోంది.ఆమెతో పాటు చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.తనతో పాటు తన తండ్రి చేసిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని, వారి పాత్రలకు మంచి పేరు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

మరి శివాని తన సినిమాతో హిట్టు కొడుతుందో లేదో చూడాలి.ఇక రాజశేఖర్ ఈ నెగిటివ్ రోల్ తో మరిన్ని ఇలాంటి పాత్రలను దక్కించుకొని జగపతిబాబు లాగా బిజీ యాక్టర్ అవుతాడో లేదో కూడా చూడాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు