చాలాచోట్ల గుమ్మిడికాయను పురుషులే ఎందుకు పగులగొడతారంటే..

గుమ్మడికాయకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.చాలా ఇళ్లలో స్త్రీలు గుమ్మడికాయను పగులగొట్టరు.

లేదా కోయరు.ఇందుకోసం పురుషుల సహాయం తీసుకుంటారు.

మొదట పురుషులు గుమ్మడికాయను కట్ చేస్తారు లేదా రెండు ముక్కలుగా పగులగొడతారు ఆ తర్వాత మహిళలు దానిని కూరలలో వేసేందుకు కట్ చేస్తారు.ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? దేశంలోని అనేక ప్రాంతాలలో స్త్రీలు గుమ్మడికాయను తమ పెద్ద కొడుకుగా పరిగణిస్తారు.అందుకే దానిని కోయరు అనే నమ్మకం ప్రభలంగా ఉంది.

హిందూ సమాజంలో పురాణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.జంతు బలులు నిర్వహించని అనేక మతపరమైన ఆచారాలలో, గుమ్మడికాయను జంతువు యొక్క చిహ్నంగా పరిగణించి బలి ఇస్తారు.

Advertisement

ఛత్తీస్‌గఢ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో, గిరిజన సమాజానికి చెందిన మహిళలు గుమ్మడి కాయను కట్ చేసే ఆలోచన కూడా చేయరు.ఒక స్త్రీ గుమ్మడికాయను కోస్తే తన పెద్ద కొడుకును బలి ఇచ్చినట్లు అవుతుందని చాలామంది నమ్ముతుంటారు.

అందుకే చాలామంది స్త్రీలు గుమ్మడికాయను పురుషుని చేత ముందుగా ముక్కలు చేయించి ఆ తరువాత కూర కోసం చిన్న ముక్కలుగా తరుగుతారు.గుమ్మడికాయ, కొబ్బరికాయలు సనాతన ధర్మంలో సాత్విక ఆరాధనలో త్యాగానికి ప్రాతినిధ్యం వహించే పండ్లు అని కాశీకి చెందిన పండితులు చెబుతుంటారు.

సనాతన సంప్రదాయంలో, స్త్రీ సృష్టికర్త, నాశనం చేసేది కాదు.ఆమె జన్మనిస్తుంది.

తల్లిగా ఉంటుంది.అందుకే గుమ్మడికాయను మహిళలు పగులగొట్టరు.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

దేశంలోని అనేక ప్రాంతాలలో ఈ ఆచారం కొనసాగుతోంది.కాగా సాధారణంగా గుమ్మడికాయలు రెండింటిని కట్ చేస్తారు.

Advertisement

ఒక్కటే కట్ చేయవలసి వస్తే మరో కూరగాయను జత చేసి కట్ చేస్తారు.ఇందుకోసం నిమ్మకాయ, మిరపకాయ లేదా బంగాళదుంపను ఉపయోగిస్తారు.

తాజా వార్తలు