అంధులు న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక‌గ‌ల కార‌ణం తెలిస్తే..

సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా అంధులు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తుంటారు.వారికి నల్ల కళ్లద్దాలు ధరించమని ఎవ‌రు సలహా ఇస్తారు? వాటిని ధరించిన తర్వాత వారి కళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ విష‌య‌మై మీరు ఎప్పుడైనా ఆలోచించారా? న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు అంధులకు అనేక విధాలుగా ఉపశమనం ఇస్తాయని నిపుణులు అంటున్నారు.

నల్ల అద్దాలు వారికి ఎలా పని చేస్తాయో తెలుసుకుందాం.

చాలా మంది అంధుల కళ్లు కొంత వరకు చూడగలవని హెల్త్‌లైన్ నివేదిక చెబుతోంది.బ్లాక్ గ్లాసెస్ వారికి మరింతగా చూడడానికి సహాయపడతాయి.కంటి చూపు కోల్పోయిన తర్వాత, బాధితులు కాంతితో ఒక రకమైన సమస్యను ఎదుర్కొంటారు.

దానిని ఫోటో ఫోబియా అంటారు.ఈ భయాన్ని నివారించడానికి, వారు నల్ల క‌ళ్ల‌ద్దాలు ధరించడం మంచిది.

సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు అంధుల కళ్లను మరింత దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతుంటారు.అందుకే నల్ల కళ్లద్దాలు పెట్టుకోవాలని సూచిస్తుంటారు.

Advertisement

ఒక పరిశోధన ప్రకారం, సూర్యుని కిరణాలు.కంటిశుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ ప్రమాదాన్ని పెంచుతాయి.

అందుకే చాల‌మంది సూర్యకాంతి నుండి తమ కళ్లను రక్షించుకోవడానికి న‌ల్ల క‌ళ్ల‌ద్దాలను ఉపయోగిస్తారు.కాగా నల్ల కళ్లద్దాలు ఆ వ్యక్తి కంటి వ్యాధితో బాధపడుతున్నాయ‌ని సూచిస్తాయి.అందుకే అత‌నికి సహాయం చేసేందుకు ముందుకు వ‌స్తారు.

న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు ధరించడానికి ఇది కూడా ఒక కారణం.

కేవలం రెండు అడుగుల స్థలంలో ఇల్లు కట్టిన ఇంజనీర్.. వీడియో చూస్తే..
Advertisement
" autoplay>

తాజా వార్తలు