తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులలో విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన వైవిద్యమైన పాత్రలను చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన పరుశురాం డైరెక్షన్ ఫ్యామిలీ స్టార్( Family star ) అనే సినిమా చేస్తున్నడు.

ఈ సినిమాతో మరొక సక్సెస్ ని సాధించి హిట్టు ట్రాక్ ఎక్కాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అదే ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నాయి.మొదట్లోనే ఆయన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే ప్రస్తుతం ఆయనకు ఒక భారీ హిట్ అవసరమైన క్రమంలో ఇప్పుడు మాత్రం ఆయన ఫ్యామిలి స్టార్ సినిమా తోనే మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన సినిమాల కంటే వదులుకున్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.
హరీష్ శంకర్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన వాల్మీకి సినిమా( Valmiki movie ) మంచి విజయాన్ని అందుకొంది.ఇక ఈ సినిమాని మొదట హరీష్ శంకర్ విజయ్ దేవరకొండ తెరకెక్కిస్తున్నాడు.

కానీ ఆయన మాత్రం ఈ సినిమా చేయడానికి ఇష్టపడలేదు.పరుశురాం దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్( ISmart Shankar ) సినిమాని కూడా విజయ్ దేవరకొండతో చేసే ప్రయత్నం చేశారు.అయితే ఈ సినిమాని కూడా తను రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాను రామ్ తో తీసి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో మరొక సక్సెస్ కొడితే విజయ్ మార్కెట్ భారీ గా పెరుగుతుంది… ఇక ఈ సినిమాలతో పాటు గా నాని హీరోగా చేసిన టక్ జగదీష్ సినిమాను కూడా విజయ్ దేవరకొండ తో చేయాలనుకున్నారు.
కానీ విజయ్ ఆ సినిమాను వదులుకొని మంచి పని చేశాడు అంటూ మరికొంత కామెంట్స్ చేస్తున్నారు.