ఎలాంటి ఈగో లేకుండా సుకుమార్ అలా మాట్లాడాడు ఏంటి..? నిజంగా నువ్వు తోపు సామి...

అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ప్రస్తుతం ఆ సినిమా కేవలం 5 రోజుల్లోనే 800 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ప్రేక్షకులందరిలో ఒక ఆనందాన్నైతే రేకేత్తిస్తుంది.

ఇక ప్రతి ఒక్క తెలుగువాడి గర్భం గా సంబురాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.ఇక తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాల్లో ఈ సినిమా మొదటి వరుసలో ఉందని చెప్పడంలో ఎంత మాత్రం తెలియదు.

ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని మరొక మెట్టు పైకి ఎక్కించాడనే చెప్పాలి.ఇక బాహుబలి సినిమాతో రాజమౌళి ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడో ఇప్పుడు సుకుమార్ కూడా అలాంటి ఒక ప్రభంజనానికి నాంది పలికాడనే చెప్పాలి.

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.అయితే పుష్ప 2 సినిమా దర్శకుడు సుకుమార్ రీసెంట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

Advertisement
Why Did Sukumar Speak Like That Without Any Ego Details, Sukumar, Pushpa 2 , All

ఇక ఈ సినిమాని తను డైరెక్ట్ చేయడంతో పాటు తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న శ్రీమన్( Sriman ) కూడా కొన్ని సీన్లకి డైరెక్షన్ చేశాడు అంటూ ఓపెన్ గా చెప్పాడు.

Why Did Sukumar Speak Like That Without Any Ego Details, Sukumar, Pushpa 2 , All

నిజానికి హీరో చైల్డ్ ఉడ్ ఎపిసోడ్స్ గాని, ఎర్ర చందనం చెక్కలను తరలించే సీన్స్ ను శ్రీమన్ డైరెక్షన్ చేశారట.అయితే ఈ విషయాన్ని సుకుమార్ ఓపెన్ గా చెప్పడం పట్ల కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికి సుకుమార్ తన గొప్పతనాన్ని మాత్రం తను చాటుకున్నాడనే చెప్పాలి.

Why Did Sukumar Speak Like That Without Any Ego Details, Sukumar, Pushpa 2 , All

తన దగ్గర పనిచేస్తున్న డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వాళ్ళకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తూ వాళ్ల గురించి చెప్పడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని అనందపరుస్తుంది.ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఎలాంటి ఈగో లకు పోకుండా తనతోపాటు శ్రీమన్ పేరుని కూడా దర్శకుడిగా ఆడ్ చేయాలి.కానీ నేనొక్కడినే డైరెక్టర్ అంటూ స్క్రీన్ మీద నా పేరు వేసుకున్నాను అంటూ ఓపెన్ గా చెప్పడం నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుడిలో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి.మరి పుష్ప 2 సినిమా అంచనాలకు మించి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది ఇప్పుడు సుకుమార్ కి కూడా భారీ రేంజ్ లో గుర్తింపునైతే తీసుకొచ్చిందనే చెప్పాలి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు