మృత సముద్రంలో ఎవ‌రూ మునిగిపోరు.. కార‌ణం ఇదే!

డెడ్ సీ అనేది రెండు దేశాల మధ్య అంటే ఇజ్రాయెల్‌కు పశ్చిమాన.జోర్డాన్‌కు తూర్పున ఉన్న ఉప్పు సరస్సు.

ఈ సముద్రంలో ఎవ‌రూ మునిగిపోలేరు అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.స‌ముద్రంలో జ‌రిగే ఈ అద్భుతమైన, విశిష్ట సాహసాన్ని ఆస్వాదించడానికి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు ఇక్కడకు వస్తారు.

మృత సముద్రం అని పిలిచే ఈ ప్రదేశంలో మనం మునిగిపోలేమ‌నేది ఆసక్తికరమైన వాస్తవం.ఈ సరస్సులోని ఉప్పు, ఇతర లోహాల పరిమాణం ఇతర మహాసముద్రాలు లేదా సరస్సుల కంటే ఎక్కువ.

దీని వల్ల ఇక్కడి నీటిలో సాంద్రత అధికంగా ఉంటుంది.ఇది నీటిలో తేలే శక్తిని మ‌రింత‌గా పెంచుతుంది.

Advertisement

అది మునిగిపోవడానికి ఆస్కారం క‌ల్పించ‌దు.ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

ఇక్కడి నీటిలో లోహాలు, లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి మేలు క‌లుగుతుంది.అందుకే పర్యాటకులు స్నానాలు చేసేందుకు ఇక్క‌డికి వస్తుంటారు.

అధిక సాంద్రత కారణంగా, ఇక్క‌డి నీటిలో నడవడం కష్టమ‌వుతుంది.నీరు మిమ్మల్ని పైకి నెట్టేస్తుంది.

ఒక‌వేళ భ‌యంతో టూరిస్టులు మునిగిపోతే మంచంపై పడుకున్నట్లు పైకి తేలివుంటారు.అయితే ఇక్క‌డి నీరు కంటిలో ప‌డ‌కుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఈ నీరు కళ్లకు హానికరం.చాలా మంది పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తుంటారు మ‌రికొంద‌రు పుస్తకాలు చదవడానికి ఈ సరస్సుకి వస్తుంటారు.

Advertisement

పాఠశాలల్లో ఈ ర‌క‌మైన సైన్స్ ప్రయోగం జరుగుతుంది.ఒక గుడ్డు సాధారణ నీటితో నిండిన పాత్రలో ఉంచిన‌ప్పుడు అది నేరుగా పాత్ర‌ దిగువన వెళ్ల‌పోతుంది.

ఇప్పుడు మరో పాత్రలో ఉప్పు నీటిని ఉంచి, దానిలో గుడ్డును ఉంచి, దిగువకు నొక్కిన‌ప్ప‌టికీ ఆ గుడ్డు ఈ ఉప్పు నీటిలో పైకి లేస్తుంది.నీటిలో ఎక్కువ ఉప్పు కలిపినప్పుడు గుడ్డు ఉపరితలంపైకి తేలుతుంది.

ఇలా తేలే బలాన్ని ఆంగ్లంలో బూయెంట్ ఫోర్స్ అని అంటారు.ఒక వస్తువును ద్రవంలో ఉంచినప్పుడు ఆ ద్రవం ఆ వస్తువుపై ఊర్థ్వ‌ బలాన్ని ప్రయోగిస్తుంది.

ఈ బలాన్ని బూయెంట్ ఫోర్స్ అని అంటారు.ఉదాహరణకు మీరు నీటిలో దూకినప్పుడు నీరు మిమ్మల్ని తిరిగి ఉపరితలంపైకి నెట్టివేస్తుంది దీనినే తేలే శక్తి అని అంటారు.

తాజా వార్తలు