అనుష్క అస్సలు ఓకే చెప్పడం లేదు.. కారణం అదేనా!

స్టార్ హీరోయిన్ గా అనుష్క( Anushka ) ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకుందో అందరికీ తెలిసిందే.

బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క నిలుస్తుందని అంతా భావించారు.

కానీ సీన్‌ రివర్స్ అయింది.బాహుబలి( Baahubali ) తర్వాత అనుష్క సినిమాలకు అస్సలు ఒకే చెప్పడం లేదు.

ఆమె గత నాలుగైదు సంవత్సరాల్లో చేసిన సినిమాలు ఒకటి రెండు మాత్రమే.ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty )హీరో గా నటిస్తున్న ఒక సినిమా లో కీలక పాత్ర లో కనిపించబోతుంది.

అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ బొద్దుగా అవ్వడం వల్ల సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.ఆ విషయమై క్లారిటీ రాలేదు.

Advertisement

కానీ అసలు అనుష్క ఎందుకు సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటుందని చర్చ మాత్రం జోరుగా సాగుతుంది.ఇండస్ట్రీ తో పాటు ఆమె సన్నిహిత వర్గాలు మరియు అభిమానులు అంతా కూడా ఎప్పుడెప్పుడు అనుష్క సినిమాలు వరుసగా వస్తాయా అంటూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాల్లో ఆమె ను హీరోయిన్ గా నటింపజేసేందుకు కొందరు దర్శక నిర్మాతలు ఆ మధ్య ప్రయత్నించారు.కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా కు ఓకే చెప్పడం లేదు.అందుకు కారణం ఏంటి అంటే మాత్రం క్లారిటీ లేదు.

అందుకే అనుష్క తీరు పై కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.మరి కొందరు మాత్రం అనుష్క అనారోగ్య సమస్యలతో బాధ పడుతోందని అందుకే ఆమెను ఇండస్ట్రీ కి దూరంగా కుటుంబ సభ్యులు ఉంచుతున్నారని తెలుస్తుంది.

ఇక అనుష్క పెళ్లి గురించి కూడా రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అసలు అనుష్కకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే ప్రబాస్( Prabhas ) పెళ్లి అయ్యే వరకు అనుష్క పెళ్లి కాదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.అనుష్క సినీ మరియు వ్యక్తిగత కెరియర్ అంతా గందర గోళంగా ఉండటానికి అసలు కారణం ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు