జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా( Devara Movie ) షూటింగ్ పూర్తవుతున్న దానికి సంబంధించిన మ్యూజిక్ వరకు మాత్రం ఇంకా జరగడం లేదు.కారణం ఏదైనా సరే ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ ని( Anirudh Ravichandran ) సంగీత దర్శకుడిగా కొలటాల శివ ఎంచుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ కారణంగానే ఈ సినిమా లేట్ అయ్యేలా కనిపిస్తుంది.అనుకున్నట్టు సమయానికి సినిమా పూర్తి కాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఎందుకంటే అనిరుద్ ఎన్నిసార్లు అడిగినా ఆ సినిమాకు సంబంధించిన పాటలను ఇవ్వడం లేదు.పైగా పాటలు మాత్రమే కాదు సినిమా రికార్డింగ్తోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు అని ఏకైక కారణంతో అందరూ అని వెంటపడుతున్నారు.
ఆ క్రీజ్ తలకెక్కిందో ఏమో కానీ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) దేవర సినిమాకు సంబంధించిన వర్క్ మాత్రం మొదలు పెట్టడం లేదు అని తెలుస్తుంది.

తమిళ భాషల్లో నెల్సన్, అట్లీ వంటి దర్శకుల సినిమాలకు ఆగమేగాల మీద సంగీతం అందించి అవుట్ పుట్ ఇచ్చేసే అనిరుద్ తెలుగు సినిమాల విషయానికొచ్చేసరికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు అర్థం కావడం లేదు.దీని వెనక మతలబు ఏంటో తెలియదు కానీ తనకు నచ్చిన భాష లేదా హీరోల కోసం త్వరగా పని చేస్తాడు అనే ముద్ర మాత్రం వేయించుకుంటున్నాడు.చాలా రోజులుగా కొరటాల శివ( Koratala Siva ) జూనియర్ ఎన్టీఆర్ అనిరుద్ ఔట్పుట్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిసిన కూడా పట్టించుకోవడం లేదు అనిరుద్ రవిచంద్రన్.
ఎంత పెద్ద సంగీత దర్శకుడు అయినా కూడా ఇలా తమ వారి కోసం ఒకలా పక్క భాష వారి కోసం మరోలా పని చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు.

ఇది ఇలాగే కొనసాగితే అనిరుద్ ఎక్కువ రోజులు తెలుగు ఇండస్ట్రీకి పనిచేసే అవకాశాలు ఉండవు.తను ఎంత పెద్ద క్రేజీ డైరెక్టర్ అయితే ఏం లాభం అణుకువ అలాగే మర్యాద కూడా పాటించాలి కదా.ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో సినిమాని పక్కన పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది.తన సొంత బాషా సినిమాలు చేసుకుంటూ దీనికి కూడా పనిచేసి అందరికీ సమన్యాయం పాటించాల్సిన అవసరం తనకి ఉంది.కానీ ఇది ఇలాగే కొనసాగితే ఇంకొక సంగీత దర్శకులను వెతుక్కోవడం పెద్ద పని కాదు కానీ మాట చెప్పి తప్పడం పద్ధతి కాదు కాబట్టి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అతడి కోసం ఎదురు చూస్తున్నాడట.
మరి చూడాలి ఈ విషయంలో ఎలాంటి సంచలనాలు వినాల్సి వస్తుందో.