అపురూప సౌందర్య రాశి ఈ హీరోయిన్ ...చివరివరకు ఎడమచేతిని చూపించకుండా నటించింది

మీనా కుమారి.ఒక‌ప్పుడు హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఓ ఊపు ఊపిన న‌టీమ‌ణి.

అందానికి తోడు అభిన‌యంలోనూ త‌న‌కు మ‌రెవ‌రూ సాటిరాని విధంగా ఉండేది.అప్ప‌ట్లో బాలీవుడ్ టాప్ న‌టులు న‌ర్గీస్, నిమ్మి, సుచిత్రా సేన్ కూడా మీనా న‌ట‌న‌కు ఫిదా అయ్యేవారు.

ఇంత‌టి అంద‌గ‌త్తె.సినిమాల్లో మాత్రం త‌న ఎడ‌‌మ చేతిని క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డేది.

ఆమె అలా చేయ‌డానికి గ‌ల కార‌ణ‌మేంటో ఇప్పుడు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం! మీనా కుమారి 1932, ఆగ‌ష్టు 1న ముస్లిం కుటుంబంలో జ‌న్మించింది.ఆమె అస‌లు పేరు మెహ‌జ‌బీన్ బేగం.

Advertisement
Why Actress Meena Kumari Not Showed Her Left Hand In Her Movies , Meena Kumari,

త‌న తండ్రి అలీ థియేట‌ర్ ఆర్టిస్టు.ఆమె త‌ల్లి కూడా సినిమా న‌టి.ఈ కార‌ణం చేత మీనా కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.1951 మే 21న త‌న భ‌ర్త‌తో క‌లిసి కారులో వెళ్తుండ‌గా యాక్సిడెంట్ అయ్యింది.మీనాకు తీవ్ర గాయాల‌యినా.

ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.ఈ ప్ర‌మాదంలో ఆమె ఎడ‌మ చేయి పూర్తిగా చిధ్రం అయ్యింది.

డాక్ట‌ర్లు ఎంతో ప్ర‌య‌త్నించి స్టీల్ రాడ్లు వేసి స‌రి చేశారు.కానీ చెయ్యి షేప్ కోల్పోయింది.

అప్ప‌టి నుంచి త‌న ఎడ‌మ చేతిని సినిమాల్లో క‌నిపించ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంది.చీర లేదంటే దుప్ప‌ట్టాతో హ్యాండ్ క‌న‌ప‌డ‌కుండా చూసుకునేది.

అందాన్ని పెంచే అర‌టి ఆకు.. ఎలా వాడాలో తెలుసా?

ద‌ర్శ‌కులు కూడా అందుకు ఏమాత్రం అబ్జెక్ష‌న్ చెప్పేవారు కాదు.

Why Actress Meena Kumari Not Showed Her Left Hand In Her Movies , Meena Kumari,
Advertisement

అటు మెహ‌జ‌బీన్ బేగంగా ఉన్న ఆమె పేరు.బైజు బావ్రా అనే సినిమా కార‌ణంగా మీనా కుమారిగా మారింది.ఆ త‌ర్వాత మంచి సినిమా ఆఫ‌ర్ల‌తో టాప్ న‌టిగా ఎదిగింది.

సినిమాల్లో న‌టించినంత కాలం మీనా కుమారి జీవితం చాలా సంతోషంగా గడిచింది.కానీ త‌న మ‌ర‌ణానికి ముందు తీవ్ర‌మైన పేద‌రికాన్ని అనుభ‌వించింది.

ఎంత‌లా అంటే.అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరినా.

వైద్యం చేయించుకునేందుకు చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేదు.ఆ విష‌యం తెలియ‌డంతో త‌న అభిమాని అయిన ఓ డాక్ట‌రు ఆమె వైద్య ఖ‌ర్చుల‌ను తానే భ‌రించాడు.

జీవిత చ‌ర‌మాంకంలో త‌ను ఒంట‌రి జీవితాన్ని గ‌డిపింది.ఎంతో మాన‌సిక క్షోభ‌కు గురైంది.

త‌న అంద‌చందాల‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న మీనా కుమారి.చివ‌రికి అత్యంత నిరుపేద స్థితిలో క‌న్నుమూసింది.

తాజా వార్తలు