శివాజీ, పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే ఆ డబ్బులు వాళ్లకిస్తారట.. అమర్ గెలిస్తే ఏం చేస్తాడంటే?

బిగ్ బాస్ షో సీజన్7 ముగింపుకు సమయం దగ్గర పడుతోంది.బిగ్ బాస్ హౌస్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

 Who Will Be The Winner Between Shivaji And Pallavi Prashanth Details Here , Shiv-TeluguStop.com

శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు విజేతగా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిస్తే గెలిచిన మొత్తాన్ని రైతులకు పంచాలని నిర్ణయం తీసుకున్నారు.

శివాజీ( Shivaji ) విజేతగా నిలిస్తే ఆ మొత్తాన్ని పల్లవి ప్రశాంత్, యావర్ లకు ఇవ్వనున్నారని సమాచారం.ఈ విధంగా శివాజీకి దక్కిన మొత్తం కూడా రైతులకు చేరే అవకాశం అయితే ఉంది.అమర్ దీప్ గెలిస్తే మాత్రం హైదరాబాద్ లో సొంతిల్లు నిర్మించుకోనున్నారని సమాచారం అందుతోంది.హైదరాబాద్ లో సొంతిల్లు ఉండాలనే అమర్ దీప్( Amardeep Chowdary ) కుటుంబ సభ్యుల కోరిక అని తెలుస్తోంది.

ముగ్గురు కంటెస్టెంట్లలో ఎవరు గెలిచినా బిగ్ బాస్ షో అభిమానుల సంతోషానికి అయితే అవధులు ఉండవని చెప్పవచ్చు.ఈ ముగ్గురు కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది.

బిగ్ బాస్ షో సీజన్7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.బిగ్ బాస్ షో సీజన్7 కు వచ్చిన రెస్పాన్స్ తో నాగ్ ఎంతో సంతోషిస్తున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు బాలయ్య, మహేష్ లలో ( Mahesh babu )ఎవరో ఒకరు గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు విజేతగా నిలిచే అవకాశం అయితే ఉందని భోగట్టా.బిగ్ బాస్ షో సీజన్7 సక్సెస్ కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube