Suella Braverman: రిషి సునాక్ కేబినెట్ నుంచి తొలగించిన సుయెల్లా ఎవరు అసలు.. ఆమె ఫ్యామిలీ చరిత్ర ఏంటి…

భారతీయ మూలాలు ఉన్న ప్రస్తుత యూకే ప్రధాని రిషి సునాక్( UK PM Rishi Sunak ) తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు షాక్ ఇస్తున్నాయి.తాజాగా అతను కేబినెట్‌లోని మరో ఎన్నారై హోమ్‌ మినిస్టర్ సుయెల్లా బ్రేవర్‌మన్‌ను( Suella Braverman ) పీకి పారేశారు.

 Who Is This Suella Braverman From Rishi Sunak Cabinet-TeluguStop.com

ఈ సంగతి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది.ఎందుకంటే వరల్డ్ వైడ్ గా అతని తొలగింపు హాట్ టాపిక్ గా మారింది.

అయితే సుయెల్లాను ఎందుకు తొలగించారు, అసలు ఆమె ఎవరు? అనే చర్చ ఇప్పుడు అటు యూకేలోనూ, ఇటు భారత్‌లోనూ సాగుతోంది.మరి ఆ వివరాలు ఏవో మనం కూడా తెలుసుకుందామా.

విశ్లేషకుల ప్రకారం, సుయెల్లాను యూకే రాజకీయ కోణంలోనే సునాక్ తొలగించాడు.బ్రిటిష్ పొలిటిషయన్‌లాగే సుయెల్లా ప్రవర్తిస్తుంది.ఆమెలో భారతీయ మూలాలు ఉన్నా సరే ఇండియాకు( India ) ఫేవర్ బుల్ గా మాట్లాడిన దాఖలాలు లేవు.రీసెంట్ టైమ్‌లో సుయెల్లా పాలస్తీనా – ఇజ్రాయిల్ వార్( Palestine Israel War ) గురించి సంచలన కామెంట్స్ చేసింది.

ముఖ్యంగా పాలస్తీనాకు మద్దతిచ్చేలా మాట్లాడింది.దాంతో అధికార పార్టీ కన్నెర్ర చేసింది, లాస్ట్ కి కేబినెట్ హోదా కోల్పోయింది.

Telugu Secretarysuella, Indianorigin, Israel, Palestine, Rael Braverman, Rishi S

సుయెల్లా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే, ఈమె బ్రిటన్‌లోనే( Britain ) పుట్టింది అక్కడే పెరిగింది.అయితే ఆమె తల్లిదండ్రులకు భారతీయ మూలాలు ఉన్నాయి.ఆమె మదర్ పేరు ఉమ,( Uma ) ఆమె పక్క సౌతిండియన్, ఇంకా వివరంగా చెప్పాలంటే ఆమె తమిళనాడుకు( Tamil Nadu ) చెందిన ఒక హిందూ మహిళ.మొదట ఆమె నర్సుగా సేవలందించింది.

తర్వాత సమాజ సేవ కోసం రాజకీయ వేత్తగా మారింది.ఇక సుయెల్లా ఫాదర్ పేరు క్రిస్టీ ఫెర్నాండెజ్.

( Christie Fernandes ) గోవాకు చెందిన ఇతను ఒక క్రిస్టియన్.ఇద్దరూ భారత్ నుంచి డైరెక్ట్ గా యూకే వెళ్లిపోలేదు.

Telugu Secretarysuella, Indianorigin, Israel, Palestine, Rael Braverman, Rishi S

ఇంతకంటే ముందు తల్లి ఉమా మారిషస్ దేశానికి వెళ్ళింది.తండ్రి ఏమో కెన్యా కి వెళ్ళాడు.1960 కాలంలో వీరిద్దరూ యూకేకి( UK ) వలస వచ్చారు.తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవడం సుయెల్లాకు జన్మనివ్వడం జరిగిపోయింది.

సుయెల్లా( Suella ) అని ఉమా పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది అదేంటంటే, ఉమకు బాగా నచ్చిన అమెరికన్ టీవీ క్యారెక్టర్ పేరు సుయెల్లా.అందుకే తన కూతురుకు ఆ పేరు పెట్టింది.

సుయెల్లా రేల్ బ్రేవర్‌మాన్‌ను( Rael Braverman ) పెళ్లి చేసుకుంది.ఆ పేరునుంచే ఆమె అసలైన పేరుకు బ్రేవర్‌మాన్ యాడ్ అయ్యింది.

Telugu Secretarysuella, Indianorigin, Israel, Palestine, Rael Braverman, Rishi S

రేల్ యూదు జాతీయుడు, ఇజ్రాయిల్‌లో పుట్టిన ఇతను ఆపై దక్షిణాఫ్రికాకు మాకాం మార్చాడు.అనంతరం అక్కడి నుంచి యూకే కి చేరుకున్నాడు.ఆ దేశంలో మెర్సిడెస్ బెంజ్ గ్రూపులో మేనేజర్‌గా పనిచేయడం మొదలుపెట్టాడు.అతనొక బుద్ధిస్ట్, సుయెల్లా కూడా బుద్ధుడిని ఆరాధిస్తుంది.

వీరు ఇది ఒక్క కామన్‌ థింగ్ మాత్రమే కాకుండా మిగతా వాటి వల్ల కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు.చివరికి మ్యారేజ్ చేసుకున్నారు.

మొత్తంగా చూసుకుంటే సుయెల్లా ఫ్యామిలీ ఒకటో రెండో, దేశాలకు దేశానికి సంబంధించినది కాదని తెలుసుకోవచ్చు.వారిని విశ్వమానవులను కూడా చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube