Devil Movie: డెవిల్ మూవీని చేతులారా మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోయిన్.. ఎవరంటే..?

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా చేసిన డెవిల్ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై ఓకే టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా ఫస్టాఫ్ మొత్తం బాగానే ఉంది.

అలాగే ఇంటర్వెల్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు.అయితే క్లైమాక్స్ మాత్రం అంత బాగాలేదు.

ఈ సినిమా చూసిన వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది.ఇంటర్వెల్ సీన్ వేరే లెవల్ లో ఉంది అని కామెంట్లు చేస్తున్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం అంత అలరించలేదని క్లైమాక్స్ వల్ల సినిమాకి మొత్తం నెగిటివ్ అయింది అంటూ కొంతమంది సినిమా చూసిన వాళ్లు అంటున్నారు.

ఇక కళ్యాణ్ రామ్ బింబిసార (Bimbisara) సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఆ తర్వాత వచ్చిన అమీగోస్ సినిమా అంత పెద్ద ప్లాఫ్ అయింది.

Who Is The Unlucky Heroine Who Missed The Devil Movie
Advertisement
Who Is The Unlucky Heroine Who Missed The Devil Movie-Devil Movie: డెవి

అయితే అమీగోస్ (Amigos) ప్లాఫ్ అవడంతో రాబోయే సినిమా విషయంలో భారీ ప్లాన్ చేయాలి అని డెవిల్ సినిమాతో మన ముందుకు వచ్చారు కల్యాణ్ రామ్.ఇక ఈ సినిమా అమీగోస్ అంత ప్లాఫ్ అవ్వకపోయినప్పటికీ ఒకే టాక్ మాత్రం తెచ్చుకుంది.ఇక ఈ సినిమాలో మరోసారి కళ్యాణ్ రామ్ తో జోడి కట్టింది మలయాళ నటి సంయుక్త మీనన్.

అయితే సంయుక్త మీనన్ (Samyuktha Menon) కంటే ముందే మరో హీరోయిన్ ని ఈ సినిమాకి హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారట మూవీ మేకర్స్.కానీ ఆ హీరోయిన్ ఇంటిదాకా వచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట.

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు సీతారామం సినిమాతో నేషనల్ వైడ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) .మొదటగా మూవీ మేకర్స్ డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మృణాల్ ని తీసుకోవాలి అనుకున్నారట.ఇక ఇదే విషయాన్ని మృణాల్ ఠాకూర్ కి కూడా చెప్పినప్పటికీ కథ బాగానే ఉంది కానీ ఇలాంటి పాత్రలో నేను నటించలేను అంటూ రిజెక్ట్ చేసి పంపించిందట.

ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ సంయుక్త మీనాన్ కి వచ్చిందట.

Advertisement

తాజా వార్తలు