నటుడు రవితేజ( Raviteja ) .మాస్ మహారాజా గా బిరుదు తెచ్చుకున్న రవితేజ అట్టడుగు స్థాయి నుండి ఎదిగారు.
ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో పనులు చేసి సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్నారు.అలా మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా స్టార్ డైరెక్టర్స్ దగ్గర చేశారు.
అలాగే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నీకోసం అనే సినిమాతో మొదటిసారి హీరోగా చేశారు.ఇక ఈ సినిమ ప్టాఫ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ డైరెక్టర్ కి హీరోకి మాత్రం మంచి ఇమేజ్ వచ్చింది.
ఇక వరుసగా ఈయన నటించిన సినిమాలు కమర్షియల్ గా హిట్ అయ్యాయి.అంతేకాకుండా ఇడియట్( Idiot ) ,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి సినిమాలు రవితేజకు మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి.
అలా రవితేజ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మిడిల్ రేంజ్ హీరోల్లో స్టార్ హీరోగా ఉన్నారు.
ఇక ధమాకా ( Dhamaka ) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయారు.
అలాంటి రవితేజ హీరోగా ఈ మధ్యకాలంలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఈయన నటించే నెక్స్ట్ మూవీ పై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఒక నిర్మాత రవితేజ గురించి మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో కలకలం సృష్టించాయి.
ఇక విషయంలోకి వెళ్తే.రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే టాక్ వినిపించింది.

అయితే వీరి కాంబినేషన్ లో ఇప్పటికే బలుపు,క్రాక్ ( Krack ) వంటి సూపర్ హిట్ సినిమాలు రావడంతో వీరి కాంబినేషన్ పై అంచనాలు పెరిగిపోయాయి.అయితే ఈ సినిమాకి అన్ని కలుపుకొని 120 కోట్ల బడ్జెట్ అవుతుంది అని సమాచారం.అయితే ఇంత డబ్బులు మేము పెట్టలేము అని నిర్మాతలు రవితేజని కాస్త రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పారట.కానీ రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదెలే అన్నట్లుగా రవితేజ ప్రవర్తించడంతో నిర్మాత నవీన్ ఎర్నేని ( Naveen Yerneni ) ఇండస్ట్రీలో నీకున్న మార్కెట్ కి ఇదే ఎక్కువ.
నీకు అంత సీన్ లేదు.

అయినా నీ మూవీ కి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తెరకెక్కించలేం అంటూ నిర్మాత రవితేజ కి మొహం మీదే చెప్పారట.దీంతో ఆ మూవీ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్టు టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఇదే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ విషయం తెలిసిన రవితేజ అభిమానులు మాత్రం నిర్మాత అలా అవమానించడం ఏమాత్రం బాగాలేదని,అసలు రవితేజ ఇమేజ్ ఏంటో ముందు తెలుసుకుని మాట్లాడాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.