Ram Mohan Naidu: రామ్మోహన్ నాయుడుని ఓడించడానికి వైసీపీకి సరైన అభ్యర్ధి దొరికాడా?

రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.2019లో జగన్‌ హవాతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 25 ఎంపీ స్థానాలకు గానూ 22 స్థానాల్లో విజయం సాధించింది.

కానీ విజయవాడ, శ్రీకాకుళం, గుంటూరులను గెలవలేకపోయారు.

శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్‌సీపీ ఐదింటిని గెలుచుకున్నప్పటికీ ఎంపీ సీటు మాత్రం రామ్‌మోహన్‌నాయుడుకే దక్కింది.రామ్ మోహన్ నాయుడు తన వాక్ చతుర్యంతో ప్రజల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు.దివంగత ఎర్రన్నాయుడు ఇమేజ్ కూడా రామ్ మోహన్‌కు కలిసోచ్చింది.2019, 2014లో దువ్వాడ శ్రీనివాస్, రెడ్డి శాంతి. రామ్మోహన్ నాయుడుపై ఓడిపోయారు.ఈసారి టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడను జగన్ ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసి, 2024లో రామ్ మోహన్ నాయుడుని ఓడించాలని జగన్ యోచిస్తున్నారు.2014, 2019లో, అభ్యర్తి ఎంపికకు జాప్యమైందని.  ఈ విషయంలో ఎక్కుంగా సమయం పట్టడంతో పార్టీ ఓటమికి కారణమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నమ్ముతోంది.

ఎంపీ టికెట్ కోసం జగన్ ఇప్పటికే ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నాడని, అయితే ఇంకా ఒకరిని లాక్ చేయలేదని ప్రచారం జరుగుతోంది.ఇక రామ్మోహన్ నాయుడు మూడోసారి కూడా గెలుపొందడంపై ధీమాగా ఉన్నారు.పైగా, శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఈసారి బలహీనంగా ఉండడంతో రామ్‌మోహన్‌నాయుడుకు గెలుపు సులభతరం అవుతుందని టీడీపీ భావిస్తోంది.

 వైఎస్ఆర్సి అభ్యర్థి రెడ్డి శాంతిపై 127,572 ఓట్లతో విజయం సాధించారు.ఇక రామ్ మోహన్ నాయుడు పార్లమెంట్‌లో తన గళాన్ని వినిపించారు.ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కూడా పార్లమెంట్‌లో పోరాడారు.

Advertisement

యువ నాయకుడిగా పార్టీలతో సంబంధం లేకుండా  రామ్మోహన్ నాయుడ్ని అందరూ అభిమానిస్తారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు